British man: 15 వేల కిలోమీటర్లు..16 దేశాలు.. 347 రోజులపాటు నాన్ స్టాప్ రన్నింగ్.

British man: 15 వేల కిలోమీటర్లు..16 దేశాలు.. 347 రోజులపాటు నాన్ స్టాప్ రన్నింగ్.

Anil kumar poka

|

Updated on: Apr 04, 2024 | 10:16 PM

మామూలుగా మారథాన్ అంటే 42 కిలోమీటర్ల పరుగు పందెం అని మనకు తెలుసు.. అంత దూరం పరుగెత్తలేని వారి కోసం హాఫ్ మారథాన్.. అంటే 21 కిలోమీటర్ల పరుగు పందెం కూడా ఉంటుంది. కానీ వేల కిలోమీటర్ల దూరాన్ని ఎవరైనా పరుగెత్తడం గురించి విన్నారా? అది అసలు సాధ్యమేనా? సాధ్యమేనని బ్రిటన్ కు చెందిన అల్ర్టా మారథాన్ పరుగుల వీరుడు రసెల్ కుక్ నిరూపిస్తున్నారు.

మామూలుగా మారథాన్ అంటే 42 కిలోమీటర్ల పరుగు పందెం అని మనకు తెలుసు.. అంత దూరం పరుగెత్తలేని వారి కోసం హాఫ్ మారథాన్.. అంటే 21 కిలోమీటర్ల పరుగు పందెం కూడా ఉంటుంది. కానీ వేల కిలోమీటర్ల దూరాన్ని ఎవరైనా పరుగెత్తడం గురించి విన్నారా? అది అసలు సాధ్యమేనా? సాధ్యమేనని బ్రిటన్ కు చెందిన అల్ర్టా మారథాన్ పరుగుల వీరుడు రసెల్ కుక్ నిరూపిస్తున్నారు. రసెల్ కుక్ అనే వ్యక్తి ప్రాజెక్టు ఆఫ్రికా పేరుతో 2023 ఏప్రిల్ 22న దక్షిణాఫ్రికా దక్షిణ అంచున వేల కిలోమీటర్ల మారథాన్‌ ప్రారంభించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 7న టునీసియాలోని బిజరెట్ వద్ద ఫినిష్ లైన్ దాటనున్నాడు. మొత్తంగా 16 ఆఫ్రికా దేశాల మీదుగా 9 వేల మైళ్లు..అంటే సుమారు 15 వేల కిలోమీటర్ల పరుగును అతను పూర్తి చేయనున్నాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే కుక్‌ లక్ష్యం. అందుకోసమే ఇంత కఠోరమైన మారథాన్‌కు శ్రీకారం చుట్టాడు. ద రన్నింగ్ చారిటీ పేరుతో అతను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పటివరకు కుక్ సుమారు రూ. 4.47 కోట్లను విరాళాల రూపంలో సేకరించాడు.

ఈ పరుగు వెనక అతని స్నేహితుడి స్ఫూర్తి ఉందని కుక్ తెలిపాడు. బీబీసీ కథనం ప్రకారం కుక్ వాస్తవానికి 360 మారథాన్లను 240 రోజుల్లో పూర్తి చేయాలని అనుకున్నాడు. అయితే వీసా సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భౌగోళిక అంశాలు, ఓ దారిదోపిడీ ఉదంతం కారణంగా అతని ప్రయాణం ఆలస్యమైంది. తన పరుగు మార్గంలో కుక్ ఎడారులు, వర్షారణ్యాలు, పర్వతాల మీదుగా ముందుకు సాగిపోయాడు. వచ్చే 5 రోజుల్లో తన పరుగును పూర్తి చేయనున్నట్లు కుక్ తాజాగా ట్వీట్ చేశాడు. మరో 5 రోజులు మిగిలి ఉంది. గత 347 రోజులు నా జీవితంలో అత్యంత కఠినమైనవి. అయినప్పటికీ ఈ ప్రయాణం నాకెంతో గౌరవమైనది అంటూ కుక్ పేర్కొన్నాడు. గతంలోనూ అతను ఆసియా ఖండాన్ని చుట్టివచ్చాడు. అలాగే ఓసారి బీర్ మారథాన్లోనూ పాల్గొన్నాడు. కుక్ ఫినిష్ లైన్ వద్దకు చేరుకోగానే అతనికి స్వాగతం పలికేందుకు ఓ మ్యూజిక్ బ్యాండ్ బృందం ఎదురుచూస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..