Viral Video: కోవిడ్ భయంతో ఇంట్లో బాలుడికి తలపై కటోరా పెట్టి హెయిర్ కటింగ్.. వైరల్ అవుతున్న వీడియో..!
Viral Video: గత ఏడాదికిపైగా విజృంభించిన కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. వైరస్ ప్రభావం, లాక్‌డౌన్ కారణంగా ఇళ్ల నుంచి..

Viral Video: గత ఏడాదికిపైగా విజృంభించిన కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. వైరస్ ప్రభావం, లాక్‌డౌన్ కారణంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా ఆరోగ్యాన్ని రక్షించుకున్నారు. ప్రస్తుతం వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వివిధ రంగాలు తెరుచుకోవడంతో జనాలు బయటకు వస్తున్నారు. ఎవరికి వారు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కరోనా కారనంగా చాలా మంది జీవితాలు ఇంటికే పరిమితం అయ్యాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టినా.. చాలా మంది కటింగ్ షాపులకు వెళ్లి జుట్టును కత్తిరించుకోవాలంటే జంకుతున్నారు. ఇళ్లల్లోనే ఉండి కుటుంబ సభ్యులతో కటింగ్ చేయించుకుంటున్నారు. పిల్లలను సైతం బయటకు పంపించకుండా హెయిర్ కటింగ్ చేస్తు్న్నారు.
ఇంట్లో ఉండి కటింగ్ చేయించుకున్న వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కుటుంబ సభ్యులు బాలుడికి ఇంట్లోనే కటింగ్ చేశారు. తలపై ఒక బౌల్ లాంటిని పెట్టి ట్రిమ్మర్‌తో కటింగ్ చేయడం వీడియో వైల్‌గా మారింది. నల్లటి ఆప్రాన్‌ను ధరించి బాలుడి తలపై గిన్నెలాంటి బౌల్‌ను ఏర్పాటు చేసి కటింగ్ చేశారు కుటుంబ సభ్యులు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను 7 లక్షలకుపైగా మంది వీక్షించారు. కొందరు రకరకాల కామెంట్లు పెట్టారు.
View this post on Instagram
Viral Video: కదిలే రైలు ఎక్కుతు కింద పడిపోయిన మహిళ.. ట్రైన్ కింద ఇరుక్కుని.. వీడియో వైరల్