AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్పీడ్‌లో నీకు సాటిలేదు.. ప్రభుత్వోద్యోగి పనికి అంతా ఫిదా.. ప్రైవేటీకరణ ప్రభావం అంటోన్న నెటిజన్లు..!

ఒక ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో అతను యంత్రంలాగా పనిచేయడంతో నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: స్పీడ్‌లో నీకు సాటిలేదు.. ప్రభుత్వోద్యోగి పనికి అంతా ఫిదా.. ప్రైవేటీకరణ ప్రభావం అంటోన్న నెటిజన్లు..!
Viral Video
Venkata Chari
| Edited By: |

Updated on: Dec 28, 2021 | 7:15 AM

Share

Viral Video: సోషల్ మీడియాలో రోజూ కొన్ని వీడియోలు వస్తూనే ఉన్నాయి. కొన్ని వీడియోలు చాలా భావోద్వేగంగా ఉంటాయి. కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి వీడియో ఒకటి ఈరోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసి మీరు కూడా ప్రభుత్వోద్యోగి ఇలా మారితే సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనుకుంటారు.

వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించినదిగా కనిపిస్తోంది. అక్కడ ఒక వ్యక్తి కొన్ని పత్రాలపై ఆగకుండా స్టాంప్ వేస్తున్నాడు. ఒక చేత్తో పేజీలు తిప్పుతూ మరో చేత్తో స్టాంప్ వేస్తున్న ఈయన స్పీడ్ చూసి మీరు కూడా మెషిన్ కంటే ఎక్కువ వేగంతో పనిచేస్తున్నారని ఆశ్చర్యపోతారు. క్షణాల వ్యవధిలో వందల పేజీలపై స్టాంపులు వేసేశాడు. దీంతో ఈ వీడియో చూసిన వారంతా అతని ప్రతిభకు ఫిదా అవుతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనితో అతను ‘ప్రైవేటీకరణ వార్తలను విన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగి సామర్థ్యంలో అపూర్వమైన పెరుగుదల కనిపిస్తోంది’ అనే క్యాప్షన్ అందించారు. ఈ వీడియోకు నాలుగు వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలా మంది వినియోగదారులు దీనిపై తమ అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలియజేశారు.

సోషల్ మీడియాలో ఈ వ్యక్తి స్పీడ్‌ని ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. చాలా మంది నెటిజన్లు దీనిపై వ్యాఖ్యానించడానికి కారణం కూడా ఇదే. ఈ వీడియో ప్రయాగ్ రాజ్ హైకోర్టు ఉద్యోగిలా ఉందని ఓ యూజర్ కామెంట్ చేయగా, ‘తన తమ్ముడు కాంట్రాక్ట్‌పై పని తీసుకున్నట్లు తెలుస్తోంది’ అంటూ రాసుకొచ్చారుు. ‘ఇదంతా ప్రైవేటీకరణ ప్రభావం’ అని మరో వినియోగదారు రాశారు.

Also Read: Viral Video: 14 నెలల తర్వాత సంరక్షకుడిని కలిసిన ఏనుగుల గుంపు.. వాటి ప్రేమకు నెటిజన్లు ఫిదా..

Viral Video: మ్యాగీ.. షరబత్ కాంబినేషన్ ఫుడ్.. మాకు ఇష్టమైన చిరుతిండిని పాడుచేయవద్దంటున్న నెటిజన్లు..