‘షేరింగ్.. కేరింగ్..’ ఆ పిల్లులు ఎంత ప్రాణ స్నేహితులో.. ముచ్చటేస్తున్న వీడియో.. మీరు ఓ లుక్కేయ్యండి..
మనుషుల మధ్యే కాదు జంతువుల మధ్య కూడా అమితమైన స్నేహబంధం ఉంటుంది. ఇక రెండు వేరు వేరు జాతులుగా మధ్య ఉన్న స్నేహానికి సంబంధించిన
మనుషుల మధ్యే కాదు జంతువుల మధ్య కూడా అమితమైన స్నేహబంధం ఉంటుంది. ఇక రెండు వేరు వేరు జాతులుగా మధ్య ఉన్న స్నేహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడు చూస్తూనే ఉంటాం. అందులో ఒకే జాతికి చెందిన జంతువుల మధ్య ఉండే స్నేహం గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండే ఇద్దరు స్నేహితులు ఒక దగ్గర కలిస్తే ఎలా ఉంటుంది. ఇక ప్రస్తుత రోజుల్లో నెట్టింట్లో ఎన్నో రకాల వీడియోలు జంతువులకు సంబంధించినవి వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అందులో రెండు పిల్లులు ఆహారాన్ని నెమ్మదిగా ఒకదానికొకటి సహయం చేసుకుంటూ తింటున్నాయి.
ఆ వీడియోలో ఒక ఇంట్లో పెంపుడు పిల్లులకు ఒకే గిన్నెలో ఆహారం పెట్టింది ఆ ఇంటి యజమాని. అయితే అవి రెండు ఆహారం కోసం కోట్టుకోకుండా.. ఒకదానికి ఒకటి సహయం చేసుకుంటూ.. నెమ్మదిగా తింటున్నాయి. ఒక పిల్లి కాస్తా ఆహారం తిన్న వెంటనే.. గిన్నెను మరో పిల్లి ముందుకు జరిపింది. ఆ తర్వాత ఆ పిల్లి కూడా తాను ఆహారం తినగానే.. అది కూడా మళ్లీ ఆ గిన్నెను మొదటి ముందుకు జరిపింది. ఇలా ఒకదానికోకటి అర్థం చేసుకోని నెమ్మదిగా ఆహారాన్ని తింటున్నాయి. ఈ వీడియోను Sh-ywild అనే యూజర్ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. షేరింగ్.. కేరింగ్ అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పిల్లులు ఆహారాన్ని పంచుకోవడం చూసిన నెటిజన్లు.. క్యూట్ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఆ క్యూట్ వీడియోను మీరు ఒక సారి చూసేయ్యండి.
View this post on Instagram
Also Read:
మోసం చేసిన బాయ్ ఫ్రెండ్.. పట్టుకోవడానికి హెల్ప్ చేసిన స్మార్ట్ వాచ్.. ఎలాగో తెలుసా..
Zomato controversy: జొమాటో వివాదం.. నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో.. మీరు ఓ లుక్కెయ్యండి..