Zomato controversy: జొమాటో వివాదం.. నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో.. మీరు ఓ లుక్కెయ్యండి..
Zomato Controversy: సోషల్ మీడియా ప్రభావంతో ఏది సీరియస్.. ఏది ఫన్నీ అనే విషయాన్ని తెల్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే.. అది ఎంతటి సీరియస్
Zomato Controversy: సోషల్ మీడియా ప్రభావంతో ఏది సీరియస్.. ఏది ఫన్నీ అనే విషయాన్ని తెల్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే.. అది ఎంతటి సీరియస్ విషయమైన దానిని కామెడిగా మార్చే టాలెంట్ మన ఇండియన్స్‌కు ఉంటుందనేది మరోసారి నిరుపించారు కొంతమంది. నెట్టింట్లో ఏదైనా వైరల్ అవుతుంది అంటే.. దానిపై ఎన్నో రకాల మీమ్స్.. ఫన్నీ స్టిక్కర్స్ దర్శనమిస్తుంటాయి. కేవలం ఇవే కాకుండా.. వివాదాలను ఫన్నీ వీడియోలుగా మార్చేస్తున్నారు. అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో హాల్ చల్ చేస్తుంది. అదేంటో తెలుసుకునే ముందు.. ఆ వీడియో వెనుక ఉన్న వివాదాన్ని తెలుసుకుందాం.
గత కొన్ని రోజుల క్రితం జోమాటో డెలివరీ బాయ్ తన పై దాడి చేసాడని బెంగుళూరుకు చెందిన యువతి ఆరోపించిన సంగతి తెలిసిందే. బెంగుళూరులో నివాసముండే హితేషా చంద్రాణీ అనే మేకప్ ఆర్టిస్ట్ గత మంగళవారం తాను జోమాటో ఫుడ్ ఆర్డర్ పెట్టినట్లుగా.. దానిని తీసుకువచ్చిన జోమాటో బాయ్ తనపై దాడి చేసి.. ముక్కుపై గుద్దినట్లుగా బుధవారం ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చలు మొదలయ్యాయి. ఈవిషయం పై జోమాటో కూడా వెంటనే స్పంధించింది. ఆమె ఫిర్యాదు చేసిన జోమాటో బాయ్ గురించి తమ దగ్గర పాజిటివ్ టాక్ ఉందని.. నిజాలు తెలియకుండా అతనిపై చర్యలు తీసుకోలేమని తెల్చిచెప్పింది. అంతేకాకుండా.. ఆమె చికిత్సకు అవసరమయ్యే ఖర్చులు, అలాగే డెలివరీ బాయ్ కు అయ్యే చట్టపరమైన లీగల్ ఖర్చులను కూడా సంస్థనే భరిస్తుందని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కొందరు నెటిజన్లు ఆ యువతి వైపు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు డెలివరీ బాయ్ వైపు మద్దతిస్తున్నారు. ఇక ఈ వివాదం పై నెట్టింట్లో పలు మీమ్స్ కూడా దర్శనమిస్తున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఎవరు రాంగ్, ఎవరు కరెక్ట్ అంటూ రకరకాల వెర్షన్లు కల్పించి వీడియోను చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ వీడియో నవ్వులు పూయిస్తుంది. మరీ మీరు ఓసారి ఆ వీడియో చూసేయ్యండి..
View this post on Instagram
Also Read:
ఆ బ్లడ్ గ్రూపు వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందా ? అధ్యయనాల్లో బయటపడ్డ ఆసక్తికర విషయాలు..