మోసం చేసిన బాయ్ ఫ్రెండ్.. పట్టుకోవడానికి హెల్ప్ చేసిన స్మార్ట్ వాచ్.. ఎలాగో తెలుసా..
ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు వలన సమస్యలే కాకుండా.. ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని సందర్బాల్లో వాటి వలన కలిగిన మేలు తెలిస్తే
ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు వలన సమస్యలే కాకుండా.. ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని సందర్బాల్లో వాటి వలన కలిగిన మేలు తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆరోగ్య నిర్వహణ, కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం, కంప్యూటింగ్, కమ్యూనికేషన్ పరంగా మన జీవితాలను సులభతరం చేసే ప్రయోజనాలను పొందవచ్చు. స్మార్ట్ వాచీలు గత కొన్ని సంవత్సరాలుగా వాటి కాంపాక్ట్ పరిమాణం, లక్షణాల వల్ల జనాదరణ పొందాయి. ఇవి వినియోగదారుల ఆరోగ్యం,వ్యాయామ దినచర్యను చెక్ చేస్తాయి. తాజాగా ఓ మహిళ తన బాయ్ ఫ్రెండ్ తనను ఎలా మోసం చేస్తున్నాడన్న విషయాన్ని తన స్మార్ట్ వాచ్ ద్వారా తెలుసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలను తెలియజేస్తూ.. ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది.
నాడియా ఎసెక్స్ అనే మహిళ తన వీడియోలతో టిక్ టాకర్గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె ఓ టిక్ టాక్ వీడియోను షేర్ చేసుకుంది. ఇందులో తన బాయ్ ఫ్రెండ్ చేసిన చీటింగ్‌ను తన స్మార్ట్ వాచ్ ఎలా పట్టించిందనే విషయం తెలుసుకుందో వివరించింది. నాడియా బాయ్ ప్రెండ్ ఒక రాత్రి బయట గడిపాడు.. తెల్లవారుజామున ఇంటికి వచ్చిన అతడికి బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు ఆమె సిద్ధమైంది. ఇంతలో ప్రియుడు స్మార్ట్ వాచ్ మెసేజ్ షేరింగ్ ద్వారా అతడి ఆరోగ్యానికి సంబంధించి ఆమెకు ఒక అలర్ట్ వచ్చింది. గత రాత్రి 2-3 గంటల మధ్య అతడు 500 క్యాలరీలను కరిగించినట్లు ఫిట్ బిట్ తెలిపింది. దీంతో ఆ రాత్రి తన బాయ్ బాయ్‌ఫ్రెండ్ బయట ఏం చేశాడన్నది ఆమెకు అర్థమైంది. దీంతో అతడికి బ్రేకప్ చేప్పెసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిని చూసిన నెటిజన్లు తమదైన కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:
Obscene Music Bans: పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో బూతు పాటలు.. ప్లేచేస్తే అంతే సంగతులు..