Viral Video: ఆడ నెమలిని ఆకట్టుకోవడానికి మగ నెమలి ప్రయత్నం.. పురివిప్పు నాట్యం.. వీడియో వైరల్

Viral Video:  నెమలి మన జాతీయ పక్షి.. అందమైన ఈ పక్షిని చూడడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా మగ నెమలి.. చిరు చినుకులు పడే సమయంలో పురి విప్ప్పి నాట్యం చేస్తే...

Viral Video: ఆడ నెమలిని ఆకట్టుకోవడానికి మగ నెమలి ప్రయత్నం.. పురివిప్పు నాట్యం.. వీడియో వైరల్
Peacock
Follow us
Surya Kala

|

Updated on: Jun 05, 2021 | 1:41 PM

Viral Video:  నెమలి మన జాతీయ పక్షి.. అందమైన ఈ పక్షిని చూడడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా మగ నెమలి.. చిరు చినుకులు పడే సమయంలో పురి విప్ప్పి నాట్యం చేస్తే.. అది చూడడానికి కనులు చాలవంటూ కవులు నెమలి నాట్యాన్ని వర్ణిస్తుంటారు. పురాణాల్లో కూడా నెమలికి అత్యంత ప్రాధాన్యత ఉంది. శ్రీకృష్ణుడు నెమలి ఈకను నెత్తి మీద ధరిస్తే… సుబ్రహ్మణ్యేశ్వర స్వామీ నెమలిని తన వాహనంగా చేసుకున్నారు..

అంతటి విశిష్టతను సొంతం చేసుకున్న నెమలి నాట్యం చేస్తూ పురివిప్పితే ఆ సోయగం ఎంతటి వారినైనా కట్టిపడేస్తుంది. దాన్ని చూసిన వారికీ ప్రకృతిలో అంతకన్నా అందమైంది ఏదీ లేదనిపిస్తుంది. అద్భుతమైన నెమలి విన్యాసాన్ని చూసి మైమరచి పోవాల్సిందే. మగ నెమలికి మాత్రమే ఇటువంటి పొడవాటి ఈకలు ఉంటాయి. ఆడ నెమలి ఆకుపచ్చ, గోధుమ, బూడిద రంగులలో ఉండే పించం ఉంటుంది. మగ నెమల్ల వలె ఆడనెమలికి పొడావాటి తోక లాంటి ఈకలు ఉండవు, కానీ వీటికి ఒక కొప్పూంటుంది.

ప్రస్తుతం అలాంటి అందమైన దృశ్యాలతో ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సుధారామెన్‌ అనే ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి ట్విటర్‌ ద్వారా పంచుకున్న నెమలి నాట్యం చేసే వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. భారీ సంఖ్యలో ఈ వీడియో వీక్షిస్తున్నారు. పురివిప్పుతున్న మగ నెమలి వెనుక ఓ ఆడనెమలి ఉంది. దీంతో ఆడ నెమలిని ఆకట్టుకోవడానికి మగ నెమలి ప్రయత్నం అమోఘం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం నెమలి సోయగాలను మీరూ ఒకసారి తిలకించండి.

Also Read: తాబేలు రాక్స్.. దాన్ని తినేందుకు వెళ్లి న‌వ్వులు పాలైన మొస‌లి.. ఏం జ‌రిగిందో మీరే చూడండి

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!