ఊరికి వెలుగునిచ్చేందుకు.. ప్రాణాలే ఫణంగా పెట్టిన లైన్‌మెన్

ఊరికి వెలుగునిచ్చేందుకు.. ప్రాణాలే ఫణంగా పెట్టిన లైన్‌మెన్

Phani CH

|

Updated on: Sep 05, 2023 | 8:15 PM

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పోటెత్తిన వరదల్లో ఓ లైన్‌మెన్ ప్రాణాలకు తెగించి కరెంట్ స్తంభమెక్కి.. కరెంట్ పునరుద్ధరించిన ఘటన గుర్తుందా.. ఆయన సాహసానికి మెచ్చి పంద్రాగస్టు రోజున ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చింది. అచ్చం అలాంటిదే..! మరో జూనియర్ లైన్‌మెన్ సాహసం చేశాడు. ప్రాణాలకు తెగించి మరీ.. నిండుకుండలా మారిన చెరువు మధ్యలో ఉన్న స్తంభం దగ్గరికి ఈదుకుంటూ వెళ్లాడు. స్తంభం ఎక్కి రిపేర్ చేసి ఊరికి కరెంటును పునరుద్ధరించాడు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పోటెత్తిన వరదల్లో ఓ లైన్‌మెన్ ప్రాణాలకు తెగించి కరెంట్ స్తంభమెక్కి.. కరెంట్ పునరుద్ధరించిన ఘటన గుర్తుందా.. ఆయన సాహసానికి మెచ్చి పంద్రాగస్టు రోజున ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చింది. అచ్చం అలాంటిదే..! మరో జూనియర్ లైన్‌మెన్ సాహసం చేశాడు. ప్రాణాలకు తెగించి మరీ.. నిండుకుండలా మారిన చెరువు మధ్యలో ఉన్న స్తంభం దగ్గరికి ఈదుకుంటూ వెళ్లాడు. స్తంభం ఎక్కి రిపేర్ చేసి ఊరికి కరెంటును పునరుద్ధరించాడు. ఆ జూనియర్ లైన్‌మెన్ చేసిన సాహసంపై స్థానికులే కాదు.. జిల్లా అధికారులు సైతం ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. హుజురాబాద్ డివిజన్‌లోని రాజపల్లి 33 కేవీ సబ్ స్టేషన్ నుంచి చెల్పూరుకు 11 కేవీ ఎక్స్ ప్రెస్ ఫీడర్ లైన్ చెరువులో నుంచి వెళ్తుంది. అయితే.. సెప్టెంబర్ 3న చెరువులో ఉన్న ఒక స్తంభంపై 11 కేవీ లైన్ బ్రేక్ డౌన్ అయింది. దీంతో.. గ్రామానికి కరెంట్ కట్ అయ్యింది. అందులోనూ భారీ వర్షం కురవటంతో.. జనాలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐదో ప్రియుడితో ముగ్గురు పిల్లల తల్లి పరార్‌.. పోస్టర్‌తో పిల్లల వెదుకులాట !!

రెప్పపాటులో తప్పించుకుంది.. లేదంటే క్షణాల్లో నూకలు చెల్లేవి

అయ్యో పాపం వృద్ధుడు.. ఆవు చేసిన పనికి

Rashmika Mandanna: తన అసిస్టెంట్ పెళ్లిలో సందడి చేసిన రష్మిక..

Aditya L1: ఆదిత్య ఎల్ 1 తొలి విన్యాసం సక్సెస్.. ఇప్పుడు ఎక్కడుందంటే ??