అయ్యో పాపం వృద్ధుడు.. ఆవు చేసిన పనికి
ఏమైందో ఏమో కానీ ఓ ఆవు పరుగెత్తుకుంటూ వచ్చి ఓ ఇంట్లో ప్రవేశించింది. దానిని నియంత్రించడానికి వెళ్లిన వృద్ధుడ్ని ఆవు ఈడ్చుకెళ్లిపోవడంతో అతడు మృతి చెందాడు. ఈ ఘటన పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఆవు ఇంట్లోకి ప్రవేశించడంతో ఆ ఇంట్లోని వారంతా కేకలు వేస్తుండగా స్థానికంగా ఉండే స్వరూప్ సింగ్ అనే 83 ఏళ్ల వ్యక్తి దానిని అదుపు చేసేందుకు వెళ్లాడు.
ఏమైందో ఏమో కానీ ఓ ఆవు పరుగెత్తుకుంటూ వచ్చి ఓ ఇంట్లో ప్రవేశించింది. దానిని నియంత్రించడానికి వెళ్లిన వృద్ధుడ్ని ఆవు ఈడ్చుకెళ్లిపోవడంతో అతడు మృతి చెందాడు. ఈ ఘటన పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఆవు ఇంట్లోకి ప్రవేశించడంతో ఆ ఇంట్లోని వారంతా కేకలు వేస్తుండగా స్థానికంగా ఉండే స్వరూప్ సింగ్ అనే 83 ఏళ్ల వ్యక్తి దానిని అదుపు చేసేందుకు వెళ్లాడు. ఆవుమెడలోని తాడు అతని చేతికి చుట్టుకుపోయింది. దాంతో నియంత్రణ కోల్పోయిన ఆవు రోడ్డుమీదకి పరుగెత్తింది. అలా వృద్ధుడ్ని 100 మీటర్ల వరకూ ఈడ్చుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీకెమెరాలో రికార్డయ్యాయి. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmika Mandanna: తన అసిస్టెంట్ పెళ్లిలో సందడి చేసిన రష్మిక..
Aditya L1: ఆదిత్య ఎల్ 1 తొలి విన్యాసం సక్సెస్.. ఇప్పుడు ఎక్కడుందంటే ??
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

