Aditya L1: ఆదిత్య ఎల్ 1 తొలి విన్యాసం సక్సెస్.. ఇప్పుడు ఎక్కడుందంటే ??
సూర్యుడిపై పరిశోధన కోసం బయలుదేరిన ఆదిత్య-ఎల్ 1 ప్రయాణం సజావుగా సాగుతోంది. భూకక్ష్యలోకి వెళ్లిన ఆదిత్య కక్ష్యను సెప్టెంబర్ 3న విజయవంతంగా పెంచారు. ఉపగ్రహం ప్రస్తుతం 245 X 22,459 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో తెలిపింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ కంట్రోల్ రూమ్ నుంచి కక్ష్యను పెంచారు. సెప్టెంబర్ 5 వేకువజామున 3 గంటలకు కక్ష్యను మరోసారి పెంచుతామని ఇస్రో వెల్లడించింది.
సూర్యుడిపై పరిశోధన కోసం బయలుదేరిన ఆదిత్య-ఎల్ 1 ప్రయాణం సజావుగా సాగుతోంది. భూకక్ష్యలోకి వెళ్లిన ఆదిత్య కక్ష్యను సెప్టెంబర్ 3న విజయవంతంగా పెంచారు. ఉపగ్రహం ప్రస్తుతం 245 X 22,459 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో తెలిపింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ కంట్రోల్ రూమ్ నుంచి కక్ష్యను పెంచారు. సెప్టెంబర్ 5 వేకువజామున 3 గంటలకు కక్ష్యను మరోసారి పెంచుతామని ఇస్రో వెల్లడించింది. 125 రోజుల్లో 145 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్న ఆదిత్య ఎల్ 1ను లాగ్రాంజ్ 1 పాయింట్‌లో ప్రవేశపెట్టి భానుడిపై అధ్యయనం కొనసాగిస్తారు. సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి పీస్‌ఎల్‌వీ-సి57 రాకెట్ ద్వారా నింగికెగసిన ఈ ఉపగ్రహం 63 నిమిషాలు ప్రయాణించి నిర్దేశిత భూ కక్ష్యలోకి వెళ్లింది. 16 రోజులు భూకక్ష్యల్లో తిరిగిన తర్వాత భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఎల్1 పాయింట్ వద్దకు చేరుకుని సూర్యుడిపై పరిశోధలను చేస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

