Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫొటోషూట్‌లో వరుడికి షాకివ్వాలనుకున్న వధువు.. కట్ చేస్తే.. సీన్ రివర్స్.. వైరలవుతోన్న వీడియో..

ఫోటోషూట్(Wedding Photoshoot) సమయంలో, వధువు అకస్మాత్తుగా చేసిన ఓ పని నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది. అయితే, వరుడు కూడా తెలివిగా ఆలోచించడంతో ఈ వీడియో కాస్తా సరదాగా మారిపోయింది.

Viral Video:  ఫొటోషూట్‌లో వరుడికి షాకివ్వాలనుకున్న వధువు.. కట్ చేస్తే.. సీన్ రివర్స్.. వైరలవుతోన్న వీడియో..
Bride And Groom Video Video
Follow us
Venkata Chari

|

Updated on: May 06, 2022 | 4:19 PM

వధూవరులకు సంబంధించిన క్యూట్ వీడియోలు (Cute Bride Videos) సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగా, ఈ వీడియోలకు సంబంధించిన కంటెంట్‌ను నెటిజన్లు చాలా ఆసక్తిగా చూస్తుంటారు. ఇంటర్నెట్‌లో ఇలాంటి వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే వైరల్‌గా మారడానికి కారణం ఇదే. ప్రస్తుతం ఓ అల్లరి వధువు(Naughty Dulhan) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఫోటోషూట్(Wedding Photoshoot) సమయంలో, వధువు అకస్మాత్తుగా చేసిన ఓ పని నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది. అయితే, వరుడు కూడా తెలివిగా ఆలోచించడంతో ఈ వీడియో కాస్తా సరదాగా మారిపోయింది. దీంతో నెటిజన్లు కూడా చాలా సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

పెళ్లిళ్లలో ఆచార వ్యవహారాలు మాత్రమే మాట్లాడుకునే రోజులు పోయాయి. ప్రస్తుతం వధూవరులు కూడా వివాహ వేడుకల్లో సరదాగా గడిపేందుకు వెనుకంజ వేయడం లేదు. ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ లేదా వెడ్డింగ్ షూట్‌తో ఎన్నో జంటలు సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా ఇదే జరిగింది. వధూవరులు ఫోటోషూట్ చేయడాన్ని మీరు వీడియోలో చూడొచ్చు. అయితే, ఈ సమయంలో పెళ్లికూతురు మనసులో ఇంకేదో ఆలోచిస్తుంది. ఫొటోగ్రాఫర్‌కి ఫోజు ఇస్తుండగా, వధువు అకస్మాత్తుగా వరుడిని కొలనులోకి నెట్టివేసేందుకు ట్రై చేస్తుంది. కానీ, వరుడు ఆమె కంటే వేగంగా ప్రతిస్పందించాడు. దీంతో ఒక్కడే స్విమ్మింగ్ ఫూల్‌లో పడిపోకుండా, వధువును కూడా పట్టుకుని దూకుతాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ, ఒకరినొకరు కౌగిలించుకున్నట్లు వీడియోలో చూడొచ్చు.

వధూవరుల ఈ అందమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో థియోడరబుల్ వెడ్డింగ్స్ అనే పేజీలో షేర్ చేశారు. ఎవరు ప్రేమలో పడుతున్నారు అంటూ ఈ వీడియోకు క్యాఫ్షన్ అందించారు. నాలుగు రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకు 2 లక్షల 91 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో, చాలా మంది వీడియోపై తమ స్పందనలను పంచుకుంటున్నారు. ‘వధువు వాటర్‌ప్రూఫ్ మేకప్ పూర్తి చేసిందని ఆశిస్తున్నాను’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఇలా ఎవరికి తోచినట్లు, వారు కామెంట్లు పంచుకుంటున్నారు. మీరు కూడా ఈ వీడియోను చూసి హ్యాపిగా నవ్వుకోండి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Puzzle: బుర్ర గిరగిరా తిరిగిపోద్ది.. ఏంటి మాస్టారూ.. ఈ ఫోటోలో గుడ్లగూబను కనిపెట్టగలరా..?

Viral Photo: మనసుంటే మార్గం ఉంటుంది.. ఫన్నీ ఫోటో షేర్ చేసిన ఆనంద్ మహేంద్ర..