Viral Video: పిడకల తయారీపై వర్సిటీలో పాఠాలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో..

Viral Video: పిడకలు ఎలా తయారు చేస్తారు.? ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ నిర్వహిస్తే ఎలా ఉంటుంది.? ఏంటీ.. పిడకలు చేయడం ఎలాగో నేర్చుకోవడానికి పాఠాలు చెబుతారా.. అని ఆశ్చర్యపోతున్నారా.! కానీ మీరు చదివింది నిజమే. పిడకాలు ఎలా..

Viral Video: పిడకల తయారీపై వర్సిటీలో పాఠాలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో..
Cow Dung Cake Video
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 08, 2022 | 12:53 PM

Viral Video: పిడకలు ఎలా తయారు చేస్తారు.? ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ నిర్వహిస్తే ఎలా ఉంటుంది.? ఏంటీ.. పిడకలు చేయడం ఎలాగో నేర్చుకోవడానికి పాఠాలు చెబుతారా.. అని ఆశ్చర్యపోతున్నారా.! కానీ మీరు చదివింది నిజమే. పిడకాలు ఎలా తయారో చేయాలో చెబుతూ యూనివర్సీటీలో పాఠాలు చెప్పారు. గ్రామాల్లో మహిళలు అలవోకగా చేసే పిడకలను యూనివర్సిటీలో పాఠాలు చెప్పడంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది..

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఇటీవల ఒక వర్క్‌ షాప్‌ జరిగింది. ఈ సందర్భంగా సోషల్ సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ కౌశల్ కిషోర్ మిశ్రా విద్యార్థులకు పిడకల తయారీ గురించి నేర్పించారు. అంతటితో ఆగకుండా పిడకల వల్ల కలిగే లాభాలను చెప్పుకొచ్చారు. పిడకలను పూజలు, హోమాల్లో ఉపయోగిస్తారని, ఆహారం వండేందుకు కూడా వాడతారని తెలిపారు. అంతటితో ఆగకుండా ఆవు పేడతో చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని, దీంతో రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని ప్రొఫెసర్‌ చెప్పుకొచ్చారు.

ప్రొఫెసర్‌ మధ్యలో కూర్చొని పిడకలు చేస్తుండగా విద్యార్థులంతా చుట్టూ చేరి పేడతో పిడకలను చేస్తున్నారు. దీనంతటినీ వీడియోగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు వర్సిటీ తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. వర్సిటీలకు వెళ్లేది జ్ఞానం సంపాదించుకోవడం కోసమని, ఇలా పిడకలు తయారు చేయడానికి కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరు స్పందిస్తూ గ్రామీణ మహిళలు ఇలాంటి శిక్షణను సులభంగా చేస్తారని, అందుకు ప్రొఫెసర్లు అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

Cow Dung Cake

Also Read: Cement prices: ఇళ్లు కట్టుకునే వారికి అలర్ట్.. పెరిగిన సిమెంట్ ధరలు.. ఎంత పెరిగాయంటే..

Khiladi: బాలీవుడ్ కాదు.. హాలీవుడ్ లెవల్లో ఖిలాడి.. నిర్మాత కొనేరు సత్యనారయణ ఆసక్తికర కామెంట్స్..

Hyderabad: బంజారాహిల్స్‌లో యూట్యూబర్ సరయు అరెస్ట్‌.. మహిళలని కించపరిచే షాట్‌ ఫిల్మ్‌ తీసినందుకు..?