Viral Video: నన్నే నరికేస్తావా.. నీ పని చెప్తా.. ప్రకృతి జోలికి వస్తే అంతే సంగతులు మరి.. వీడియో వైరల్..

చెట్లు.. మానవ మనుగడకు అతి ముఖ్యమైనవి. మన జీవనానికి కావాల్సిన ఆక్సిజన్‏ను ఇస్తూ ప్రాణకోటికి ఆధారంగా నిలుస్తున్నాయి.

Viral Video: నన్నే నరికేస్తావా.. నీ పని చెప్తా.. ప్రకృతి జోలికి వస్తే అంతే సంగతులు మరి.. వీడియో వైరల్..
Tree
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 08, 2022 | 12:55 PM

చెట్లు.. మానవ మనుగడకు అతి ముఖ్యమైనవి. మన జీవనానికి కావాల్సిన ఆక్సిజన్‏ను ఇస్తూ ప్రాణకోటికి ఆధారంగా నిలుస్తున్నాయి. కానీ ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతూ అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న ప్రపంచం.. ప్రాణకోటి జీవనాధరమైన చెట్లను విచ్చలవిడిగా నరికేస్తున్నాము.. దీంతో ప్రపంచవ్యాప్తంగా చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గత కొన్నేళ్లుగా చెట్లను పెంచండి అంటూ ప్రభుత్వాలు.. పర్యావరణ పరిరక్షణ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. మానవ మనుగడ సహజంగా సాగాలంటే మనకు ఆక్సిజన్ ఉండాలి.. అందుకు చెట్లు కచ్చితంగా ఉండాల్సిందే. కానీ ప్రస్తుతం ఆధునికత, పట్టణీకరణ, అభివృద్ధి పేరుతో చెట్లను నరికేస్తున్నారు. దీంతో కరోనా ప్రభావంతో ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఓవైపు చెట్లను పెంచండి.. మొక్కలు నాటండి అంటూ ప్రభుత్వాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరికిన వారికి భారీ స్థాయిలో జరిమాన విధించడం కూడా జరుగుతుంది. అయితే ఓ భారీ వృక్షాన్ని నరికేసిన ఓ వ్యక్తికి ఆ చెట్టే బుద్ది చెప్పింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో రోజూకీ కొన్ని వందల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని నవ్వులు పూయించగా.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కల్గిస్తాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ భారీ వృక్షాన్ని నరికిన వ్యక్తి చెట్టు పడిపోతూ బుద్ది చెప్పింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి తన ఇంటి పరిసరాల్లో ఉన్న భారీ వృక్షాన్ని చిన్న నిచ్చెన సాయంతో సగానికి పైగా నరికేసాడు. అయితే ఆ చెట్టు పడిపోతున్న సమయంలో దాని చివరి భాగం నిచ్చెనకు తగడంతో ఆ వ్యక్తి బోర్లాపడిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం..చెట్టు రివేంజ్ తీర్చుకుందని.. చేసిన కర్మకు ఫలితమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

Also Read: Actor Photo: మొదటి సినిమాతోనే అమ్మాయిల మనసు దోచుకున్న ఈ స్టార్.. సీనియర్ హీరో తనయుడు..ఎవరో గుర్తుపట్టండి..

Nivetha pethuraj: డిజిటల్ ఎంట్రీకి సిద్దమైన టాలెంటెడ్ బ్యూటీ.. ఆహాలో నివేదా పేతురాజ్ ‘బ్లడీ మేరీ’..ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్..

F3 Movie: పైసా ఉంటే ప్రపంచమే పిల్లి.. లబ్ డబ్ పాటకు అదిరిపోయే రెస్పాన్స్.. థియేటర్లలో ఎఫ్ 3 సందడి ఎప్పుడంటే..

Ram Gopal Varma: సోషల్ మీడియాలో అప్సరా రాణితో ఆర్జీవి రచ్చ.. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నా అంటూ..