AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఆటో డ్రైవర్ మామూలోడు కాదు.. ఒక్క వీడియోతో సినిమాలో ఛాన్స్ పట్టేశాడు.. సెలబ్రిటీ అయిపోయాడు..

Auto Driver Impresses Netizens : "అబ్బ సొత్తు కాదు టాలెంటు.. ఎవడబ్బ సొత్తు కాదు టాలెంటు" అంటూ ఓ సినిమాలో హీరో పాట పాడుతూ ఉంటాడు.

ఈ ఆటో డ్రైవర్ మామూలోడు కాదు.. ఒక్క వీడియోతో సినిమాలో ఛాన్స్ పట్టేశాడు.. సెలబ్రిటీ అయిపోయాడు..
Auto Driver Impresses Netiz
uppula Raju
|

Updated on: Mar 16, 2021 | 4:25 PM

Share

Auto Driver Impresses Netizens : “అబ్బ సొత్తు కాదు టాలెంటు.. ఎవడబ్బ సొత్తు కాదు టాలెంటు” అంటూ ఓ సినిమాలో హీరో పాట పాడుతూ ఉంటాడు. నిజంగా టాలెంట్ ఉంటే ఎవరైనా సెలబ్రిటీ అయిపోవచ్చు. గతంలో అయితే ఎంతో ప్రతిభ ఉండి సరైన అవకాశాలు లేక కనుమరుగైన వారు చాలామంది ఉన్నారు. కానీ నేటి ఆధునిక కాలంలో ఎవరి టాలెంట్ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. సెల్‌ఫోన్ ఉంటే చాలు అరచేతిలో ప్రపంచం ఉన్నట్లే. మీకు మీరే హీరో.. మీకు మీరే డైరెక్టర్ చెలరేగిపోవచ్చు. దీనికి తోడు సోషల్ మీడియా వేదికగా ఉండనే ఉంది. లైకులు, షేర్లు, పోస్ట్‌లు, కామెంట్లు అంటూ ఒక్క రోజులో సెలబ్రిటీని చేసి కూర్చుండబెడతాయి. తాజాగా ఓ ఆటో డ్రైవర్ ఒక్క వీడియోతో ఒక్క రోజులో సెలబ్రిటీ అయిపోయాడు. ఏకంగా మరాఠి మూవీలో సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు.

మహారాష్ట్ర, పుణె సిటీకి దగ్గరలోని బారామతి తాలుకాకు చెందిన ఆటో‌డ్రైవర్ బాబాజి కాంబ్లేకు డ్యాన్స్ అంటే ప్రాణం. డ్యాన్సర్‌గా, హీరోగా రాణించాలని కలలు కన్నాడు కానీ, సరైన అవకాశాలు లభించలేదు. ఈ క్రమంలో తన డ్యాన్సింగ్ స్కిల్స్‌ను అప్పుడప్పుడూ రోడ్డుపైనే ప్రదర్శిస్తుంటాడు. కాగా ఇటీవలే తన తోటి ఆటోడ్రైవర్ల ఎదుట ‘మల జావు ధ్యానా ఘరి’ అనే పాటకు మహారాష్ట్ర పాపులర్ డ్యాన్స్ ‘లవని’ స్టైల్‌లో పర్ఫార్మ్ చేసి ఫిదా చేశాడు. ఆ పాటకు అచ్చం సినిమా హీరోలా చేసిన ఆయన డ్యాన్స్ వీడియోను అతడి స్నేహితులు నెట్టింట షేర్ చేయగా, నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఆ ఒక్క వీడియోతో కాంబ్లే సెలబ్రిటీ అయిపోయాడు. ఈ వీడియోను మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ దయానంద్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయడం విశేషం. కాగా ఈ ట్రెండింగ్ వీడియో చూసిన మరాఠి ఫిల్మ్ డైరెక్టర్ ఘన్‌శ్యామ్ విష్ణు‌పంత్ యేడే తన సినిమాలో నటించాలని కాంబ్లేకు ఆఫర్ కూడా ఇచ్చారు. ఇక సినిమాలో ఆఫర్ లభించడం పట్ల ఆటో డ్రైవర్ కాంబ్లే ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

Vizag Mayor : వైజాగ్ మేయర్ గా మహిళ.. వైసీపీ అధిష్టానం యోచన.! ఎంపికలో విజయసాయిరెడ్డికే ఫుల్ పవర్స్

Praveen Kumar’s Oath: దుమారం రేపుతున్న స్వేరోస్ ప్రతినిధుల ప్రతిజ్ఞ.. సారీ చెప్పినా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను వీడని వివాదం..