AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ బామ్మ ఎంతో మందికి ఆదర్శం.. నెటిజెన్లతో శభాష్‌ అనిపించుకంటోన్న 80 ఏళ్ల అవ్వ..

Viral Video: ప్రస్తుతం సమాజంలో నిరాశ ఎక్కువై పోయింది. చిన్న వయసు వారైనా జీవితం అంతా అయిపోయిందని, అనుకున్నదేదో సాధించలేదని తీవ్ర నిరాశకు...

Viral Video: ఈ బామ్మ ఎంతో మందికి ఆదర్శం.. నెటిజెన్లతో శభాష్‌ అనిపించుకంటోన్న 80 ఏళ్ల అవ్వ..
Old Women Viral Video
Narender Vaitla
|

Updated on: Aug 01, 2021 | 12:59 PM

Share

Viral Video: ప్రస్తుతం సమాజంలో నిరాశ ఎక్కువై పోయింది. చిన్న వయసు వారైనా జీవితం అంతా అయిపోయిందని, అనుకున్నదేదో సాధించలేదని తీవ్ర నిరాశకు గురవుతుంటారు. కోరుకున్న ఉద్యోగం రాలేదని, పరిస్థితులు అనుకూలించలేవని ఇతరులపై నిందలు వేస్తూ జీవితాన్ని భారంగా భావిస్తుంటారు. అయితే మనలో చేయాలనే ఆకాంక్ష, సాధించాలనే సత్తా ఉండాలే కానీ ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ బామ్మ వీడియోనే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. అమృత్‌సర్‌కు చెందిన 80 ఏళ్ల ముసలవ్వ ఓ జ్యూస్‌ సెంటర్‌ను నడిపిస్తూ జీవనం సాగిస్తుంది. అంత వయసులోనూ చలాకీగా పనిచేస్తూ తన సొంత కాళ్లపై తాను నిలబడుతోంది. ఇటీవల ఈ జ్యూస్‌ స్టాల్‌ వద్దకు వెళ్లిన కొందరు బామ్మ జ్యూస్‌ తయారు చేస్తుండగా వీడియోను తీశారు. ఈ వీడియోను ‘యూట్యూబ్‌ స్వాద్‌’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. అంత వయసులోనూ ముసలమ్మ పని చేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా బామ్మకు హ్యాట్సాఫ్‌ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరు ఆ బామ్మకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ.. జ్యూస్‌ స్టాల్‌ అడ్రస్‌ను పోస్ట్‌ చేసి అందరూ బామ్మ జ్యూస్‌ సెంటర్‌ను సందర్శించండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ బామ్మ జ్యూస్‌ స్టాల్‌ అమృత్‌సర్‌లోని రాని దా బాగ్‌లో ఎస్‌బీఐ బ్యాంక్‌ ఎదురుగా ఉందని కొందరు పోస్ట్ చేశారు.

వైరల్‌గా మారిన వీడియో..

Also Read: Viral Video : ఆమె కోసం ఆయన.. వయసు పెరిగిన కరగని అనుబంధం.. వైరల్ అవుతోన్న వీడియో..

అస్సాంతో సరిహద్దు వివాదాన్ని సానుకూలంగా పరిష్కరించుకుంటాం.. మిజోరం సీఎం జొరాంతాంగా

Weight Loss : బరువు తగ్గేందుకు 5 చిట్కాలు.. కొన్ని వారాల్లోనే ఫలితం చూసి వాహ్ అనాల్సిందే