Malla Reddy: మంత్రి మల్లారెడ్డి ఎంత వరకు చదువుకున్నారో తెలుసా..?
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఎడ్యూకేషన్ క్వాలిఫికేషన్ గురించి సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి టీవీ9 పొలిటికల్ కాన్ క్లేవ్ వేదికగా స్పందించారు మల్లారెడ్డి. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకూ బోయిన్‌పల్లి జిల్లా పరిషత్ స్కూల్లో చదివినట్లు తెలిపారు. జర్నలిస్ట్ గౌరీ శంకర్ 10వ తరగతి వరకూ తన క్లాస్‌మెట్ అని చెప్పారు. ఇంటర్మీడియట్ కోర్స్.. మొదటి బ్యాచ్ తనతోనే ప్రారంభమైందని వివరించారు.

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఎడ్యూకేషన్ క్వాలిఫికేషన్ గురించి సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి టీవీ9 పొలిటికల్ కాన్ క్లేవ్ వేదికగా స్పందించారు మల్లారెడ్డి. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకూ బోయిన్‌పల్లి జిల్లా పరిషత్ స్కూల్లో చదివినట్లు తెలిపారు. జర్నలిస్ట్ గౌరీ శంకర్ 10వ తరగతి వరకూ తన క్లాస్‌మెట్ అని చెప్పారు. ఇంటర్మీడియట్ కోర్స్.. మొదటి బ్యాచ్ తనతోనే ప్రారంభమైందని వివరించారు. అయితే తన చదువు విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు.
వెస్ట్లీ స్కూల్‌లో 10వ తరగతి వరకు చదివితే ఇంటర్ వరకు చదివినట్లు గత అఫిడవిట్లో తప్పుగా పొందుపరిచానని తెలిపారు. ప్రస్తుతం తాను చదివిన ఇంటర్ కాలేజ్ ప్రభుత్వం చేతుల్లో నుంచి దాతలు తీసుకోవడంతో దానిపేరు రాఘవ ప్రభుత్వ కళాశాలగా మార్చినట్లు తెలిపారు. ఇంటర్ రెండేళ్లు పూర్తి చేసి తన బీఏ గ్రాడ్యూయేషన్ కోర్సును సర్థార్ పటేల్ డిగ్రీ కళాశాలలో చదివినట్లు వెల్లడించారు. అయితే తన వృత్తి రిత్యా ఎదురైన సమస్యల కారణంగా కేవలం ఒక నెలరోజులు మాత్రమే డిగ్రీ విద్యను అభ్యసించినట్లు చెప్పారు.
మల్లారెడ్డి పూర్తి వీడియో..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




