Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunita Williams: సునీతా విలియమ్స్‌ స్పేస్‌వాక్‌ చూశారా ??

Sunita Williams: సునీతా విలియమ్స్‌ స్పేస్‌వాక్‌ చూశారా ??

Phani CH

|

Updated on: Jan 21, 2025 | 6:30 PM

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి, స్టేషన్‌ కమాండర్‌ సునీతా విలియమ్స్‌ దినచర్య కాస్త మారింది. దాదాపు ఏడు నెలలపాటు శాస్త్రీయ ప్రయోగాలతో గడిపిన ఆమె ఐఎస్‌ఎస్‌ బయటకొచ్చి వచ్చి స్పేస్‌వాక్‌ చేశారు. కాసేపు అంతరిక్షంలో విహరించడమే స్పేస్‌వాక్‌.

నాసాకే చెందిన మరో వ్యోమగామి నిక్‌ హేగ్‌తో కలిసి సునీతా విలియమ్స్‌ ఐఎస్‌ఎస్‌కు అవసరమైన మరమ్మతులు చేపట్టారు. ఆ సమయంలో ఐఎస్‌ఎస్‌ తుర్క్‌మెనిస్తాన్‌కు సరిగ్గా 260 మైళ్ల ఎత్తులో ఉందని నాసా తెలిపింది. గతేడాది జూన్‌ 5వ తేదీన బోయింగ్‌ కొత్త స్టార్‌లైనర్‌ క్రూ క్యాప్సూల్‌లో.. సునీత, విల్‌మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. వారంపాటు టెస్ట్‌ ఫ్లైట్‌ తర్వాత వాళ్లు తిరిగి భూమికి చేరాల్సి ఉంది. కానీ.. బోయింగ్‌ స్టార్‌లైనర్‌కు సాంకేతిక సమస్య తలెత్తింది. థ్రస్టర్‌ ఫెయిల్యూర్‌, హిలీయం లీకేజీతో.. ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. దీంతో సెప్టెంబర్‌ 7వ తేదీన ఆ ఇద్దరు వ్యోమగాములు లేకుండానే క్యాప్సూల్‌ భూమ్మీదకు వచ్చేసింది. వాళ్లు భూమ్మీదకు ఎప్పుడు తిరిగి వస్తారో అనే ఆందోళన మొదలైంది. టెంపరరీ విజిటర్స్‌గా వెళ్లిన సునీతా, విల్‌మోర్‌లు.. ఐఎస్‌ఎస్‌కు ఫుల్‌టైం సిబ్బందిగా మారిపోయారు. అంతరిక్షంలో ఇరుక్కుపోయినవాళ్లను రక్షించేందుకు మంచి ఐడియాలు గనుక ఇస్తే.. 17 లక్షల క్యాష్‌ ప్రైజ్‌ ఇస్తామని నాసా ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన ఫొటోలు, వీడియోల్లో సునీతా విలియమ్స్ బరువు తగ్గినట్లు స్పష్టమైంది. గురుత్వాకర్షణ శక్తి లేని అలాంటి చోట.. కండరాలు, ఎముకలు క్షీణతకు గురవుతాయి. అలాంటప్పుడు.. రోజుకి రెండున్నర గంటలపాటు వ్యాయామాలు చేయడం తప్పనిసరి. అయితే నాసా మాత్రం ఆమె ఆరోగ్యంపై వస్తున్న కథనాలను.. పుకార్లుగా కొట్టిపారేస్తోంది. బరువు తగ్గినప్పటికీ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ను అందిస్తూ వస్తోంది. కానీ, ఐఎస్‌ఎస్‌లో ఆమె పరిస్థితిని చూసి నాసా ఏమైనా దాస్తోందా? అనే అనుమానాలు కలిగాయి. ఈ తరుణంలో తాను క్షేమంగానే ఉన్నానంటూ స్వయంగా సునీతనే ఓ వీడియో విడుదల చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడిరోడ్డుపై భారీ దోపిడి.. బైక్‌పై వచ్చి కాల్పులు

H-1B Visa: అమెరికన్‌ ఉద్యోగులకు H1B ముప్పు

మహా కుంభమేళాలో గోల్డెన్‌ బాబా.. ఒళ్లంతా బంగారమే

నరకం నుంచి విముక్తి.. హమాస్ బందీల భావోద్వేగం..

ఎమర్జెన్సీ సినిమా బ్యాన్.. సిక్కుల తీవ్ర ఆందోళనలు