AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు నచ్చినోళ్లనే సెలెక్ట్ చేస్తారా? టీమిండియా టెస్ట్ టీం ఎంపికపై విమర్శలు వీడియో

నవంబర్ 14న దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా జట్టును ప్రకటించారు. అయితే కెప్టెన్ గిల్, కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌లకు నచ్చిన ఆటగాళ్లనే ఎంపిక చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ బాధ్యతలు స్వీకరించనుండగా, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా తిరిగి జట్టులో చేరడం కీలక పరిణామం. ఆకాశ్ దీప్ బౌలింగ్ విభాగంలోకి వచ్చాడు.

Samatha J
|

Updated on: Nov 16, 2025 | 2:10 PM

Share

నవంబర్ 14 నుంచి దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా జట్టును ప్రకటించారు. ఈ జట్టు ఎంపికపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లకు ఇష్టమైన ఆటగాళ్లను మాత్రమే తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓపెనింగ్ బాధ్యతలను యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ భుజాలపై పడనున్నాయి. వీరిద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్‌కు స్థిరత్వాన్ని అందించనున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో

మీ బ్యాంక్‌ ఎకౌంట్‌ భద్రమేనా? వీడియో

మోడల్‌ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో