AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒంటి కాలుతో చిన్నారి పోరాటం.. చూసిన నెటిజన్ల కంట కన్నీరు.. వీడియో

Little girl with prosthetic leg: కొన్ని సంఘటనలు మనసును కలిచివేస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఈ వీడియో కూడా ఒకటి. ఒంటి కాలుతో ఆ కాలుతో ఆ చిన్నారి చేస్తున్న పోరాటం అందరికీ కన్నీళ్లు తెప్పిస్తుంది. అన్ని అవయవాలు సరిగా ఉన్నవారే కొన్ని

Viral Video: ఒంటి కాలుతో చిన్నారి పోరాటం.. చూసిన నెటిజన్ల కంట కన్నీరు.. వీడియో
Little Girl With Prosthetic Leg
Shaik Madar Saheb
|

Updated on: May 29, 2021 | 1:03 PM

Share

Little girl with prosthetic leg: కొన్ని సంఘటనలు మనసును కలిచివేస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఈ వీడియో కూడా ఒకటి. ఒంటి కాలుతో ఆ కాలుతో ఆ చిన్నారి చేస్తున్న పోరాటం అందరికీ కన్నీళ్లు తెప్పిస్తుంది. అన్ని అవయవాలు సరిగా ఉన్నవారే కొన్ని పనులు ఇప్పటికీ.. చేయలేకపోతుంటారు. అలాంటిది అంగవైకల్యం కలిగిన ఓ చిన్నారి ఔరా అనిపించింది. ఆమె బలం ముందు తన వైకల్యమే చిన్నబోయింది. పట్టుదల, కృషితో దేన్నైనా సాధించగలనని నిరూపించింది ఆ చిన్నారి. ఓ వీడియోలో అంటోనెల్లా అనే ఐదేళ్ల చిన్నారి ప్రొస్తెటిక్‌ కాలు (కృత్రిమ కాలు) తో చిన్న లోయలా ఉండే ఓ గుంతలో పడిపోయింది. అక్కడి నుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో జారీ కిందకు పడిపోతుంది. అలా పలుమార్లు కింపడుతుంది. అసలు తాను పైకి ఎక్కుతుందో.. లేదో.. తెలియదు కానీ.. తన తల్లి ఎంకరేజ్ చేస్తుంటే కచ్చితంగా ఎక్కగలను అనే నమ్మకాన్ని కూడగట్టుకొని పైకి ఎక్కుతుంది.

వీడియో..

‘‘నువ్వు ఎక్కగలవు.. కింద పడవు. నీవు బలవంతురాలివి’’ అంటూ తల్లి ప్రోత్సాహపరుస్తుండటంతో ఒంటి కాలితో మెల్లమెల్లగా పైకి ఎక్కింది. పైకి వెళ్లిన తరువాత వెనక్కి తిరిగి తల్లిని చూస్తూ చిరునవ్వు చిందించింది దీనికి సంబంధించిన వీడియోను గుడ్‌న్యూస్‌ కరస్పాండెంట్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. చిన్నారి లోయనుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తున్న ఈ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. అనేకమంది లైకులు, రీట్వీట్‌లు చేస్తుండటంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. అంటోనెల్లా తన తల్లిని ఎప్పటికి గుర్తుంటుచుంటుంది. తాను ఒక పోరాట యోధురాలిగా ఎదుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు అంటూ పలువురు అంటోనెల్లా మద్దతుగా కామెంట్‌ చేస్తున్నారు.

Also Read:

ఆ కెనడా ఎంపీ మళ్ళీ ఏం చేశాడంటే .? ‘తప్పు’ ఒప్పుకుంటున్నా…! అపాలజీ చెబుతున్నా అంటూనే … !

Fake Currency: మీ దగ్గరున్న రూ. 100 నోట్లు అసలైనవేనా.? నకిలీ నోట్లను ఇలా క్షణాల్లో గుర్తించండి.!