Hyderabad: రెచ్చిపోతున్న యువకులు.. హైదరాబాద్ రోడ్లపై..
హైదరాబాద్‌లో యువత రెచ్చిపోతున్నారు. రాత్రి అయ్యిందంటే చాలు రోడ్లపై నానా హంగామా చేస్తున్నారు. పోలీసులు ఉంటారని తెలిసినా, సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసినా చెలరేగిపోతున్నారు. పోకిరీలో వెకిలి చేష్టలకు ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో యువకులు హల్చల్ చేశారు. బైక్‌లతో రాత్రివేళలో...
హైదరాబాద్‌లో యువత రెచ్చిపోతున్నారు. రాత్రి అయ్యిందంటే చాలు రోడ్లపై నానా హంగామా చేస్తున్నారు. పోలీసులు ఉంటారని తెలిసినా, సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసినా చెలరేగిపోతున్నారు. పోకిరీలో వెకిలి చేష్టలకు ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో యువకులు హల్చల్ చేశారు. బైక్‌లతో రాత్రివేళలో స్టంట్‌లు చేస్తూ రెచ్చిపోయారు. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 140 నుంచి 170 వరకు బైక్ లతో స్టంట్ లు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.