AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ అలవాట్లున్న అమ్మాయిలకు 20ల్లోనే వృద్ధాప్యం.. వీడియో

ప్రతిఒక్కరూ ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకు ఎన్నో సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించి వివిధ వ్యాయామాలు కూడా చేస్తుంటారు. అన్ని వ్యాయామాలు చేసినప్పటికీ, కొంతమంది మహిళలు 25 ఏళ్ల వయసులోనూ 40 ఏళ్ల వారిలా కనిపిస్తారు. చిన్న వయసులో వృద్ధురాలిలా ఎందుకు కనిపిస్తున్నారో తెలియక తెగ ఆందోళన పడుతుంటారు. నిజానికి, ఇలాంటి అమ్మాయిలు వారి రోజువారీ అలవాట్ల కారణంగా ఇలా అకాల వృద్ధాప్యానికి గురవుతున్నారని నిపుణులు అంటున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం. అందుకే నిపుణులు రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలని సిఫార్సు చేస్తుంటారు. కానీ కొంతమంది అమ్మాయిలు ఈ విషయంలో కాస్త ఉదాసీనతగా ఉండి వ్యాయామం చేయరు. అలాంటి అమ్మాయిలు తమ వయసుకంటే కాస్త ముందుగానే వృద్ధులుగా కనిపిస్తారు.

Samatha J
|

Updated on: Apr 18, 2025 | 1:09 PM

Share

అతిగా ఆందోళన చెందడం కూడా అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది. ఈ విషయం తెలిసినా కొంతమంది అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే చింతిస్తూ రోజులు గడుపుతుంటారు. ఎక్కువగా ఆందోళన చెందే అమ్మాయిలు తమ వయస్సు కంటే పెద్దవారిగా కనిపిస్తారు. మితిమీరిన కోపం మంచిది కాదని పెద్దలు అంటుంటారు. కానీ కొంతమంది అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. ఈ కోపం మానసిక సమస్యలు, ఒత్తిడి, నిరాశకు కారణమవుతుంది. ఇది అకాలంగా వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చాలామందికి నీళ్లు సరిగా తాగరు. ఈ అలవాటు అమ్మాయిల్లో వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నిద్రకూడా చాలా అవసరం. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. కానీ కొంతమంది అమ్మాయిలు ఆలస్యంగా పడుకుని ఉదయాన్నే త్వరగా మేల్కొంటారు. వీరికి తగినంత నిద్ర ఉండదు. ఈ నిద్ర లేకపోవడం ఒత్తిడికి గురిచేసి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

మరిన్ని వీడియోల కోసం

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో

అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో

రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో

Follow Us
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..