Vishal: మహిళల్ని వక్ర దృష్టితో చూసేవారికి శిక్ష పడాలి

నటుడు విశాల్‌ జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఇబ్బందిపెట్టిన వారికి తగిన శిక్ష పడాలన్నారు. అంతేకాకుండా కోలీవుడ్‌లోనూ హేమ లాంటి కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. 10 మంది సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటుచేసే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు.

Follow us

|

Updated on: Sep 02, 2024 | 8:27 PM

నటుడు విశాల్‌ జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఇబ్బందిపెట్టిన వారికి తగిన శిక్ష పడాలన్నారు. అంతేకాకుండా కోలీవుడ్‌లోనూ హేమ లాంటి కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. 10 మంది సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటుచేసే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్‌ హేమ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్‌ గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చకు దారితీసింది. హేమ కమిటీ రిపోర్ట్‌లోని విషయాలు చదివి షాకయ్యాననీ విశాల్‌ అన్నారు. మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం బాధాకరమనీ తమ సినిమాల్లో అవకాశం ఇస్తామని చెప్పి.. మహిళలతో తప్పుగా ప్రవర్తించేవారికి తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా స్పందించాలనీ సినిమాల్లో అవకాశాలిస్తాం తమకు కొన్ని ఫేవర్స్ చేయాలని అడిగిన వారి చెంప చెళ్లుమనిపించాలని అన్నారు. నకిలీ నిర్మాణ సంస్థల వల్ల కోలీవుడ్‌లోనూ పలువురు మహిళలు ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. తమ చిత్ర పరిశ్రమలోనూ ఈ తరహా కమిటీ ఏర్పాటు చేస్తామని.. దీనికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని విశాల్‌ తెలిపారు. దాదాపు ఏడేళ్లు శ్రమించి జస్టిస్‌ హేమ కమిటీ ఈ రిపోర్ట్‌ను సిద్ధం చేసింది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్‌ కండిషన్లు, రెమ్యూనరేషన్‌, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం వంటి అంశాలను అధ్యయనం చేసిన కమిటీ.. కాస్టింగ్‌ కౌచ్‌ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. విశాల్‌ తన పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో వేడుకలు చేసుకున్నారు. వృద్ధులకు అన్నదానం చేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెలన్నరలో ఏడుగురు తోడేళ్లకు బలి !! ఆ గ్రామంలో జరుగుతున్న నరమాంస భక్షక భీభత్సం