Thangalaan: విజయవాడ బాబాయ్ హోటల్‌లో సందడి చేసిన తంగలాన్ టీమ్
ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2022లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ చెన్నై, హైదరాబాద్, మధురై, కర్ణాటక సహా పలు లొకేషన్లలో చిత్రీకరించారు. చాలా రోజుల క్రితం 'తంగలాన్' ట్రైలర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మూవీ టీమ్. విజయవాడలోని బాబాయ్ హోటల్ కు వెళ్లారు.
చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తంగలాన్. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విక్రమ్ చాలా డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2022లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ చెన్నై, హైదరాబాద్, మధురై, కర్ణాటక సహా పలు లొకేషన్లలో చిత్రీకరించారు. చాలా రోజుల క్రితం ‘తంగలాన్’ ట్రైలర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మూవీ టీమ్. విజయవాడలోని బాబాయ్ హోటల్ కు వెళ్లారు. హీరో విక్రమ్, హీరోయిన్ మాళవిక మోహనన్ తో పాటు నిర్మాతలు కూడా ఉన్నారు. వీరిని చూడటానికి జనం ఎగబడ్డారు. ఇందుకు సంబందించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక తంగలాన్ సినిమాలో పార్వతి, మాళవిక మోహనన్, పశుపతి తదితరులు నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ సంగీతం సమకూర్చారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో పీరియాడికల్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది.