Balakrishna: దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బాలయ్య ఫ్యాన్స్
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'డాకు మహారాజ్'. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ , సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు.
ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రమోషన్లలో భాగంగా అమెరికాలోని డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. దీని కంటే ముందే ‘దబిడి దిబిడి’ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజైన కొద్ది గంటల్లోనే ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తూ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అదే సమయంలో దబిడి దిబిడి సాంగ్ పై ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఇందులో బాలయ్య, ఊర్వశి రౌతేలా వేసిన మాస్ స్టెప్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అదే సమయంలో కొందరు ఈ స్టెప్పులపై విమర్శలు చేస్తున్నారు. ఇదేం కొరియోగ్రఫీ అంటూ నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దబిడి దిబిడి సాంగ్ పై వస్తోన్న ట్రోలింగ్‌ను బాలకృష్ణ అభిమానులు తిప్పికొడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: పుష్ప2 ధాటికి గల్లంతైన బాహుబలి2 రికార్డ్
180 కి.మీ. వేగంతో దూసుకెళ్లినా.. గ్లాసు కదల్లేదు
మహిళలూ.. స్పై కెమెరాల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి