Hyderabad: ట్రైన్ దిగొచ్చిన పాసింజర్‌ను ఆపిన పోలీసులు.. అనుమానమొచ్చి చెక్ చేయగా..!
అది లింగంపల్లి రైల్వేస్టేషన్.. అప్పుడే ఓ ఎంఎంటీఎస్ రైలు ప్లాట్‌ఫామ్ పైకి వచ్చింది. అది వచ్చీరాగానే.. ఆ రైలు కోసం వెయిట్ చేసిన ప్రయాణీకులు ఎక్కేందుకు సిద్దమయ్యారు. ఇక చివరి స్టేషన్‌లో దిగిన పాసింజర్లు స్టేషన్ బయటకు వస్తున్నారు. అంతే.! ఒక్కసారిగా అలజడి.. ఇంతకీ అసలేం జరిగిందంటే.?
అది లింగంపల్లి రైల్వేస్టేషన్.. అప్పుడే ఓ ఎంఎంటీఎస్ రైలు ప్లాట్‌ఫామ్ పైకి వచ్చింది. అది వచ్చీరాగానే.. ఆ రైలు కోసం వెయిట్ చేసిన ప్రయాణీకులు ఎక్కేందుకు సిద్దమయ్యారు. ఇక చివరి స్టేషన్‌లో దిగిన పాసింజర్లు స్టేషన్ బయటకు వస్తున్నారు. అంతే.! ఒక్కసారిగా అలజడి.. ఏదో నక్సలైట్‌ను పట్టుకుంటున్నట్టు.. రైల్వేస్టేషన్ బయటకు వస్తున్న ఓ పాసింజర్‌ను రెండు ప్రక్కల నుంచి మఫ్టీలో ఉన్న పోలీసులు వచ్చి పట్టుకున్నారు. కట్ చేస్తే.. ఇంకేముంది గంజాయి వాసన గుప్పుమంది.
వివరాల్లోకి వెళ్తే.. శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్‌లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతోనే బుధవారం రాత్రి లింగంపల్లి స్టేషన్‌లో ఎంఎంటీఎస్ ట్రైన్ దిగిన రాహుల్ అనే వ్యక్తి దగ్గర నుంచి 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఒడిస్సా నుంచి హైదరాబాద్‌కు అక్రమ గంజాయిని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సదరు నిందితుడు తరలిస్తున్నట్టు గుర్తించారు. చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి గచ్చిబౌలిలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విద్యార్ధులకు నిందితుడు రాహుల్ గంజాయిని విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం..