‘Miss AI’ భామల అందాల పోటీలు…! ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా..విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?

ఏప్రిల్ 21 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందాల పోటీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, మే 10న విజేతను ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీల మాదిరిగానే, నైపుణ్యం, ప్రతిభ, సంజ్ఞ మొదలైన కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని AI విజేతలను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ జనరేట్ బ్యూటీస్ అందాల పోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతకు..

‘Miss AI’ భామల అందాల పోటీలు…! ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా..విజేతకు బహుమతి  ఎంతో తెలుసా..?
Miss Ai Beauty Contest
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 19, 2024 | 12:54 PM

AI ..ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. సాంకేతిక రంగంలో ఇదో కొత్త విప్లవాన్ని సృష్టిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతిక రంగం నుండి విద్యా రంగం వరకు చాలా మంది ఎంప్లాయిస్‌ని తమ ఉద్యోగాల తొలగింపుకు కారణంగా మారింది. వీటన్నింటి మధ్య తాజాగా మరో అంశం తెరమీదకు వచ్చింది. AI ఇప్పుడు అందాల పోటీలలో కూడా పాల్గొనాలని నిర్ణయించుకుంది. సాధారణంగా మీరు మిస్ ఇండియా, మిస్ వరల్డ్ , మిస్ యూనివర్స్వంటి అందాల పోటీల గురించి వినే ఉంటారు. కా, నీ మిస్ AI పోటీ గురించి ఎప్పుడైనా విన్నారా? మిస్ AI పోటీ కూడా ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహించబడింది. మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీల మాదిరిగానే, నైపుణ్యం, ప్రతిభ, సంజ్ఞ మొదలైన కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని AI విజేతలను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ జనరేట్ బ్యూటీస్ అందాల పోటీల్లో పాల్గొంటారు.

వరల్డ్ AI క్రియేటర్ అవార్డ్స్ (WAICAs) ద్వారా నిర్వహించబడుతున్న ఈ అందాల పోటీని టెక్ ప్రపంచంలోని ‘ఆస్కార్స్’గా పిలుస్తున్నారు. ఈ అందాల పోటీకి న్యాయనిర్ణేతలుగా స్పెయిన్‌కు చెందిన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఐటానా లోపెజ్, మరో ప్రభావవంతమైన AI మోడల్ ఎమిలీ పెల్లెగ్రిని ఎంపికయ్యారు. ఇది కాకుండా ఈ పోటీలో ఇద్దరు మనుషులు న్యాయనిర్ణేతలుగా ఉంటారు.

ఈ మిస్ ఏఐ పోటీలో గెలుపొందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యూటీకి రూ. 15 లక్షల బహుమతి కూడా లభిస్తుంది. ఏప్రిల్ 21 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందాల పోటీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, మే 10న విజేతను ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..