Viral Video: సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..

సోషల్ మీడియాలో అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ వాటిల్లో కొన్ని మాత్రం నిజంగానే హృదయాలను హత్తుకుంటాయి. ఎప్పుడు ఎలాంటి వీడియో వైరల్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. కొన్ని రకాల వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. వాటిల్లో అనేక రకాల వీడియోలు ఉంటాయి. సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ వీడియోలే కాకుండా జంతువుల వీడియోలు కూడా బాగా వైరల్

Viral Video: సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
Viral Video
Follow us
Chinni Enni

|

Updated on: Apr 19, 2024 | 3:33 PM

సోషల్ మీడియాలో అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ వాటిల్లో కొన్ని మాత్రం నిజంగానే హృదయాలను హత్తుకుంటాయి. ఎప్పుడు ఎలాంటి వీడియో వైరల్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. కొన్ని రకాల వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. వాటిల్లో అనేక రకాల వీడియోలు ఉంటాయి. సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ వీడియోలే కాకుండా జంతువుల వీడియోలు కూడా బాగా వైరల్ అవుతాయి. అవి చేసే కొన్ని క్యూట్ మూమెంట్స్ చాలా నవ్వు తెప్పిస్తాయి. ఇలాంటివి కూడా జరుగుతాయా? అని ఈ వీడియోలు చూశాకే అర్థమవుతాయి.

క్రూర జంతువుల్లో కొన్ని మంచివి కూడా ఉంటాయి. మరికొన్ని జంతువులు చేసే చిలిపి పనులు చాలా బావుంటాయి. ఇప్పుడు వీటికి సంబంధించిన దానిలో ఈ వీడియో కూడా ఒకటి. కొంత మంది సెల్ఫీలు తీసుకోవడానికి వెళ్లి.. ఎలుగు బంటి పిల్లల్ని తల్లి నుంచి వేరు చేయడానికి ట్రై చేశారు. ఈ ఘటన నార్త్ కరోలినాలో జరిగింది.

వీడియోలో ఏముందంటే..

నార్త్ కరోలినాలో కొంత మంది పర్యాటకులు సెల్ఫీలు తీసుకోవడానికి ఎలుబంటి పిల్లల దగ్గరకు వెళ్లారు. అక్కడు మూడు చిన్న ఎలుగు బంటి పిల్లలు చెట్టుపై ఉన్నాయి. వెంటనే ఆ పర్యాటకులు చెట్టు మీద ఉన్న ఎలుగు బంటి పిల్లల్ని చేతులతో బలవంతంగా బయటకు లాగారు. ఆ తర్వాత ఆ ఎలుగు బంటి పిల్లలతో చాలా సెల్ఫీలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఒక ఎలుగు బంటి పిల్ల కింద కూడా పడిపోయింది. వారి నుంచి తప్పించుకోవడానికి ఎలుగు బంటి పిల్ల అటూ ఇటూ తిరిగింది. దానిని పట్టుకునేందుకు పర్యాటకులు ట్రై చేశారు. అయితే ఒక ఎలుగు బంటిని మాత్రం పట్టికెళ్లిపోయారు.

ఇదంతా దగ్గర్లో ఉన్న ఓ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇది కాస్తా స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ గా మారింది. తల్లి నుంచి ఎలుగు బంటి పిల్లల్ని వేరు చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.