Viral: పెద్దపులికి సుస్సు పోయించిన ఎలుగుబంటి.. పరుగో పరుగు

ఏ వన్యప్రాణి అయినా పిల్లలతో ఉన్నప్పుడు ప్రమాదకరంగా మారుతుంది. కానీ ఎలుగుబంటికి ఆవేశపాళ్లు ఇంకాస్త ఎక్కువ. అది పిల్లలతో సంచరించేటప్పుడు జంతువైనా, మనిషి అయినా ఎదురైతే ఎలాంటి శషభిషలు లేకుండా దాడికి పూనుకుంటుంది. వాటి పదునైన గోళ్ల ధాటికి పెద్దపులులు కూడా భయపడతాయని నిపుణులు చెబుతారు.

Viral: పెద్దపులికి సుస్సు పోయించిన ఎలుగుబంటి.. పరుగో పరుగు
Tiger Vs Bear
Follow us

|

Updated on: Apr 19, 2024 | 3:19 PM

అడవి జంతువులు మధ్య పోరు ఎంత భయానకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక జీవికి ఆకలి వేస్తే.. మరో దాని ప్రాణం పోయినట్లే. ఇక అడవిలో సింహం తర్వాత అత్యంత పవర్‌ఫుల్ యానిమల్ పెద్ద పులి. పులి ఏ జంతువుకూ భయపడదు. మాటు వేసి.. కాపు కాసి.. ఏ జంతువునైనా వేటాడుతుంది. అది విసిరే పంజాకి అంత పవర్ ఉంటుంది. అందుకే పెద్ద పులి అంటే మిగిలిన జంతువులు అన్నీ సుస్సు పోసుకుంటాయి. అయితే ఎలుగుబంటి మాత్రం ఇందుకు మినిహాయింపు అనే చెప్పాలి.  భల్లూకానికి కోపం వస్తే.. పెద్ద పులి సైతం ప్రాణ భయంతో పరారవ్వాల్సిందే. తాజాగా అలాంటి ఘటనే  తెలంగాణ  బోర్డర్.. మహారాష్ట్రలోని తడోబా టైగర్‌ రిజర్వు కోర్‌ ప్రాంతంలో జరిగింది. కల్వర్టు పక్కన నీటి కుంటలో ఉన్న ఎలుగుబంటి వైపు..  పులి అనుకోకుండా వెళ్లింది. అంతే.. ఎలుగుబంటి ఒక్క ఉదుటున లేచి ముందుకు నడుస్తూ.. పెద్దపులిని కోపం చూసింది. దీంతో పులి భయంతో ఒక్కో అడుగు వెనక్కి వేసింది.  ఆ తర్వాత ఎలుగుబంటి ఆ పెద్దపులిని పరుగులు పెట్టించింది. అందుకు సంబంధించిన ఫోటోలను జీపులో వెళుతున్న ఓ పర్యాటకుడు తన కెమెరాలో బంధించగా సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఎలుగుబంటికి పిల్లలు అంటే ఎంతో ప్రేమ. నిత్యం తన వీపుపై మోస్తూ తిరగడం ఉంటాయి.  పిల్లలను రక్షించుకునేందుకు  ఎదురు పడిన జీవిని అయినా వదిలిపెట్టవు. వాటి పదునైన గోళ్ల ధాటికి పెద్దపులులు కూడా భయపడతాయని నిపుణులు చెబుతుంటారు.

ఎలుగుబంటి మాంసాహార జంతువుల లిస్ట్‌లో ఉంటుంది. కానీ, అదే పనిగా మాంసాహారం తినదు. పుట్టలను తవ్వి చీమలు, చెదలను తింటుంది. అలాగే వివిధ ఫలాలను కూడా ఆరగిస్తుంది. రేగు పళ్లను ఇష్టంగా తింటుంది. తేనె పట్టులను కూడా ఇవి  ఆహారంగా తీసుకుంటాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..