Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో ఇదేం ట్రిక్‌ తల్లి..! విమానంలో లగేజ్‌ ఛార్జీలు తప్పించుకోవటానికి ఇంత బరువు మోశావా..?

రైనాయర్ విమానంలో ప్రయాణించాల్సి ఉంది. అయితే, రైనాయర్ విమానంలో బ్యాగ్ తీసుకెళ్లాలనుకుంటే అది చాలా ఖరీదు. కానీ, మూడు రోజుల పర్యటన కోసం తను 10జతల బట్టలు తీసుకువెళ్లాలనుకుంది. కానీ, విమాన ఛార్జీల కారణంగా అలా చేయడం చాలా కష్టమవుతోందని భావించింది. దాంతో ఆమె ఎవరూ ఊహించని విధంగా ఓ ట్రిక్‌ ప్లే చేసింది.

వామ్మో ఇదేం ట్రిక్‌ తల్లి..! విమానంలో లగేజ్‌ ఛార్జీలు తప్పించుకోవటానికి ఇంత బరువు మోశావా..?
Travel Hacks
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 29, 2025 | 7:32 PM

విమానంలో ప్రయాణించేటప్పుడు లగేజ్‌ ఎక్కువైతే ప్రయాణీకులు ఎక్స్‌ట్రా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అదనపు చెల్లింపును నివారించడానికి చాలా మంది లగేజీ పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కానీ, ఒక 20 ఏళ్ల అమ్మాయి విమానాశ్రయంలో భారీ లగేజీ ఫీజులను ఆదా చేయడానికి ఒక గొప్ప ఉపాయం చేసింది. ఇప్పుడు ట్రిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రతిచోటా దీనిపైనే విపరీతంగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ యువతి చేసిన ఉపాయం ఏంటంటే..

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన గ్రేస్ హేల్ ఇటీవల ఇంగ్లాండ్ నుండి స్కాట్లాండ్ కు బయలుదేరింది. రైనాయర్ విమానంలో ప్రయాణించాల్సి ఉంది. అయితే, రైనాయర్ విమానంలో బ్యాగ్ తీసుకెళ్లాలనుకుంటే అది చాలా ఖరీదు. కానీ, మూడు రోజుల పర్యటన కోసం తను 10జతల బట్టలు తీసుకువెళ్లాలనుకుంది. కానీ, విమాన ఛార్జీల కారణంగా అలా చేయడం చాలా కష్టమవుతోందని భావించింది. దాంతో ఆమె ఎవరూ ఊహించని విధంగా ఓ ట్రిక్‌ ప్లే చేసింది. తాను గర్భవతిగా నటించింది. ఆమె తన వస్తువులను తన బట్టల కింద దాచిపెట్టి, వాటిని ప్రెగ్నెన్సీ బంప్ లాగా చూపించింది. అలా తాను ఆమె గర్భవతినంటూ అందరికీ కనిపించేలా నటించింది.

Travel Hacks

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఎయిర్‌లైన్స్‌ ఎక్స్‌ట్రా ఛార్జీలు తప్పించుకునేందుకు యువతి ఎలా ప్లాన్ చేసిందో వివరించింది. నిజంగా ఆమె మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే తాను ముందుగా గర్భధారణలో ఏయే నెలలో ఆడవారు ఎలా ఉంటారో, పొట్టలో బిడ్డతో కలిపి వారి బరువు ఎలా ఉంటుంది అనే విషయాలను ముందుగా ఇంటర్‌నెట్‌ ద్వారా తెలుసుకుంది. ఆ తర్వాత తాను 26 వారాల గర్భవతిగా నటించాలని ఎంచుకున్నట్టుగా చెప్పింది. అలాగే, ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిన తర్వాత గర్భిణీలు ఎలా నడుస్తారో సరిగ్గా అలానే నడిచేందుకు ముందుగానే ప్రాక్టీస్‌ చేసినట్టుగా చెప్పింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..