ప్రారంభానికి సిద్ధమైన పంబన్ బ్రిడ్జి.. ఆ రోజునే జాతికి అంకితం చేయనున్న మోదీ..!
కొత్త వంతెన ఎలక్ట్రోమెకానికల్ వ్యవస్థ ద్వారా నిర్వహించబడుతుంది. దీనివల్ల సముద్రంలో ఓడల రాకపోకలకు సులభతరం అవుతుంది. ఓడ వచ్చే సమయానికి వంతెనను పైకి లేపుతారు. వంతెనను ఎత్తడానికి 5 నిమిషాల సమయం పడుతుంది. ఒకే ఒక్క మనిషి దీన్ని ఎత్తగలడు. అంటే, వంతెనను ఎత్తడానికి ఎక్కువ మంది అవసరం ఉండదు. అయితే, గాలి వేగం సమస్య కూడా ఉంది. సముద్రంలో గాలి వేగం

ఏప్రిల్ 6న శ్రీ రామనవమి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామేశ్వరంలో పర్యటించనున్నారు.. ఈ సందర్భంగా ఆయన కొత్త పంబన్ రైల్వే వంతెనను ప్రజలకు అంకితం చేస్తారు. తమిళనాడులోని రామేశ్వరం- తాంబరం మధ్య బ్రిటిష్ కాలంలో నిర్మించిన పంబన్ బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెన సిద్ధమైంది. పాత వంతెన స్థానంలో కొత్త పంబన్ వంతెన వస్తుంది. పంబన్ బ్రిడ్జి పాతబడి పోవడంతో కేంద్రం కొత్త వంతెనను నిర్మించింది. పనులు పూర్తి కావడంతో అధికారులు శనివారం ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఏప్రిల్ 6న ఈ వంతెనను ప్రారంభించనున్నారు. పాత పంబన్ వంతెనను బ్రిటిష్ వారు 1914 సంవత్సరంలో నిర్మించారు. తుప్పు పట్టడం వల్ల 2022 సంవత్సరంలో దీనిని మూసివేశారు.
పాత పంబన్ వంతెన స్థానంలో కొత్త పంబన్ వంతెన నిర్మించబడింది. ఈ వంతెన 2.5 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంది. దీనిని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) రూ. 535 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఇందుకు సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఇలా రాశారు, ఇది (పాంబన్ వంతెన) హై-స్పీడ్ రైళ్లు, ట్రాఫిక్ రద్దీని నిర్వహించడానికి నిర్మించబడింది. కొత్త పాంబన్ వంతెన ఉపయోగకరంగా ఉండటమే కాదు, ఇది పురోగతికి చిహ్నం. ఇది ఆధునిక ఇంజనీరింగ్‌తో ప్రజలను, ప్రదేశాలను కలుపుతుంది.. అంటూ వ్యాఖ్యానించారు.
రామేశ్వరం, ధనుష్కోడికి చేరుకోవడానికి గతంలో రైల్వే పంబన్ వంతెన ఏకైక మార్గం. ఈ వంతెనను 1914 లో నిర్మించారు. తరువాత 1988 సంవత్సరంలో దాని పక్కనే ఒక రోడ్డు వంతెన నిర్మించబడింది. 1988 వరకు మండపం, రామేశ్వరం ద్వీపం మధ్య రైలు మార్గం మాత్రమే ఏకైక రవాణాగా ఉండేది.
వీడియో ఇక్కడ చూడండి..
కొత్త వంతెన ఎలక్ట్రోమెకానికల్ వ్యవస్థ ద్వారా నిర్వహించబడుతుంది. దీనివల్ల సముద్రంలో ఓడల రాకపోకలకు సులభతరం అవుతుంది. ఓడ వచ్చే సమయానికి వంతెనను పైకి లేపుతారు. వంతెనను ఎత్తడానికి 5 నిమిషాల సమయం పడుతుంది. ఒకే ఒక్క మనిషి దీన్ని ఎత్తగలడు. అంటే, వంతెనను ఎత్తడానికి ఎక్కువ మంది అవసరం ఉండదు. అయితే, గాలి వేగం సమస్య కూడా ఉంది. సముద్రంలో గాలి వేగం గంటకు 58 కి.మీ లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు వంతెన ఎత్తే వ్యవస్థ పనిచేయదు. ఇలాంటి పరిస్థితులు అక్టోబర్, ఫిబ్రవరి మధ్య జరుగుతుందని అధికారులు చెప్పారు. ఈ నెలల్లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..