Viral Video: స్టైల్‍గా కాలువ దాటాలనుకున్న చిన్నది.. కట్ చేస్తే సీన్ రివర్స్.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..
రీల్స్ కోసం ఏదో కొత్తగా ట్రై చేయాలని చూసి అనుహ్యంగా ప్రమాదంలో పడిపోతుంటారు..
ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారి గురించి చెప్పక్కర్లేదు. లైక్స్, వ్యూస్ కోసం కొందరు సాహాసాలు చేస్తుంటారు.. మరికొందరు మాత్రం సరికొత్తగా ప్రయత్నిస్తుంటారు.. డ్యాన్స్, డైలాగ్స్ అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రీల్స్ మైకంలో తమ చుట్టూ ఏం జరుగుతున్నది పట్టించుకోకుండా గంటలు గంటలు సోషల్ మీడియాలో మునిగి తేలుతుంటారు. అయితే వారు చేసే రీల్స్ కొన్నిసార్లు ఆశ్చర్య కలిగిస్తాయి.. మరికొన్ని మాత్రం షాకింగ్ గా అనిపిస్తే.. ఇంకొన్ని నవ్వులు పూయిస్తుంటాయి. రీల్స్ కోసం ఏదో కొత్తగా ట్రై చేయాలని చూసి అనుహ్యంగా ప్రమాదంలో పడిపోతుంటారు.. లేదంటే వారు అనుకున్న దానికి భిన్నంగా జరిగి కామెడీగా మారిపోతుంది. ఇప్పుడు ఓ అమ్మాయి చేసిన పని ఇప్పుడు నవ్వులు పూయిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా.
ఆ వీడియోలో ఓ అమ్మాయి రీల్స్ కోసం పాట పాడుతూ స్టైల్‍గా కాలువ దాటాలి అనుకుంది. అనుకున్నట్టుగానే కాలువకు మరో వైపు ఓ వ్యక్తి ఫోన్ పట్టుకుని వీడియో తీస్తున్నాడు. ఎంతో సంతోషంగా కాలువను దాటాలనుకుని పరిగెత్తుకుంటూ వచ్చి కాలువ పై నుంచి దూకింది.. అంతే కాలు జారి అడ్డంగా పడిపోయింది. దీంతో ఆమె కాళ్లకు ముఖంపై దెబ్బలు తగలడంతో అక్కడి నుంచి తిరిగి లేవలేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Ups! pic.twitter.com/cRIo05a0kh
— Los Negros Del Ataúd ⚰ (@NegrosConAtaud) June 16, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.