AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: బాబోయ్‌ బటర్‌ టీ.. మా ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు అంటున్న నెటిజన్లు..! వీడియో వైరల్‌

ఈ టీ వీడియోపై చాలా మంది ప్రజలు తీవ్రంగా స్పందించారు. కొందరు ఆమెపై దాడి చేయడానికి కూడా సిద్ధపడుతున్నట్టుగా రాశారు. మేం ఢిల్లీకి వస్తున్నాం. టీ తాగడానికే కాదు నీకు గుణపాఠం చెప్పడానికి తప్పకుండా లక్ష్మీనగర్ వస్తాను అంటూ వ్యాఖ్యనించారు. మరొకరు స్పందిస్తూ...ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవద్దు అంటూ పేర్కొన్నారు.

Watch: బాబోయ్‌ బటర్‌ టీ.. మా ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు అంటున్న నెటిజన్లు..! వీడియో వైరల్‌
Woman Selling Butter Tea
Jyothi Gadda
|

Updated on: Dec 19, 2024 | 2:44 PM

Share

మన దేశంలో చాయ్‌ ప్రియులు చాలా మంది ఉన్నారు. టీ కేవలం ఓ రుచికరమైన పానీయం మాత్రమే కాదు.. ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. సంతోషం, బాధ, సుఖం, నలుగురు కలిసిన ఓ సమావేశం.. సందర్భం ఏదైనా సరే.. చాయ్‌పార్టీ జరగాల్సిందే..ఇకపోతే, ఇలాంటి చాయ్‌ తయారీకి సంబంధించి సోషల్ మీడియాలో విభిన్న ప్రయోగాలు వైరల్‌ అవుతుంటాయి. ఈసారి కూడా ఓ మహిళ టీ స్టాల్‌ వైరల్ అవుతోంది. ఆమె తయారు చేసిన చాయ్‌ ఇంటర్నెట్ వినియోగదారులను ఉలిక్కిపడేలా చేసింది. ఇలాంటి వెరైటీ టీ తయారు చేస్తున్న మహిళపై నెటిజన్లు ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ ఆ టీ స్పెషల్ ఏంటో పూర్తి వివరాల్లోకి వెళితే…

వైరల్‌ వీడియో ప్రకారం.. ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లో టీ అమ్ముతున్న ఒక మహిళ ప్రత్యేకించి బటర్ టీ తయారు చేస్తుంది. అయితే, ఆమె స్టాల్‌కి వచ్చిన ఓ కస్టమర్‌ 5 రూపాయలకు టీ కావాలని అడుతున్నాడు.. అందుకు ఆమె స్పందిస్తూ.. హాలో బ్రదర్‌ ఇక్కడ 5 రూపాయలకు టీ రాదని చెప్పింది. ఇక్కడ చాయ్‌ విలువ యాభై రూపాయలు అని చెప్పింది. అందుకు ఆ వ్లాగర్‌ షాక్‌ అవుతాడు. సరే అక్కా.. అదే టీ ఇవ్వు అని అడుగుతాడు.. దాంతో ఆమె అతనికి టీ సర్వ్‌ చేయటం ప్రారంభిస్తుంది.

ఇవి కూడా చదవండి

అప్పటికే, తయారు చేసి ఫ్లాస్క్‌లో పోసి ఉంచిన టీని ఆమె మట్టి సాసర్‌లో సర్వ్‌ చేస్తుంది. ఆపై అందులో అమూల్ వెన్న కలుపుతుంది. ఇంతకుముందు, వ్లాగర్ అడిగినప్పుడు ఆమె టీ చేయడానికి అమూల్ పాలను ఉపయోగించినట్లు చెప్పింది. ఆ తరువాత అందులోనే బటర్ కూడా వేసింది. ఇప్పుడు బటర్‌ టీ రెడీ అని చెబుతుంది. ఇది చూసిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు షాక్‌ అవుతున్నారు. బాబోయ్‌ ఇదేం టీ తల్లీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Foodie Rana (@foodie_rana_)

వీడియోకు ఇప్పటికే 2 లక్షల 89 వేలకు పైగా వ్యూస్‌, 2 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. కామెంట్ సెక్షన్‌లో 1800 కంటే ఎక్కువ స్పందనలు వచ్చాయి. ఈ టీ వీడియోపై చాలా మంది ప్రజలు తీవ్రంగా స్పందించారు. కొందరు ఆమెపై దాడి చేయడానికి కూడా సిద్ధపడుతున్నట్టుగా రాశారు. మేం ఢిల్లీకి వస్తున్నాం. టీ తాగడానికే కాదు నీకు గుణపాఠం చెప్పడానికి తప్పకుండా లక్ష్మీనగర్ వస్తాను అంటూ వ్యాఖ్యనించారు. మరొకరు స్పందిస్తూ…ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవద్దు అంటూ పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి