AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో గత 95 ఏళ్లుగా ఒక్క బిడ్డ కూడా పుట్టని మిస్టీరియస్‌ దేశం.! కారణం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

ఇదోక మిస్టీరియస్‌ దేశం.. ఎందుకంటే.. ఇక్కడ గత 95ఏళ్లుగా ఒక బిడ్డ కూడా పుట్టలేదు. పసివాళ్ల నవ్వులు, ఏడుపు ఏది ఇక్కడ వినిపించదు. అయినప్పటికీ ఈ దేశంలో జనాభా ఎలా పెరుగుతోందని మీరు ఆశ్చర్యపోతారు. పైగా ఈ దేశం ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇంతకీ ఆ దేశం ఏది..? ఎందుకు అక్కడ పిల్లలు పుట్టడం లేదు..? ఇప్పుడు తెలుసుకుందాం..

వామ్మో గత 95 ఏళ్లుగా ఒక్క బిడ్డ కూడా పుట్టని మిస్టీరియస్‌ దేశం.! కారణం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..
Newborn
Jyothi Gadda
|

Updated on: Dec 19, 2024 | 1:49 PM

Share

ప్రపంచంలో ప్రతిరోజూ మిలియన్ల మంది పిల్లలు పుడుతున్నారు. అందువల్ల జనాభా వేగంగా పెరుగుతోంది. ఇది పర్యావరణ పరంగా ఆందోళన కలిగించే విషయం. UN జనాభా అంచనాల ప్రకారం, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం చైనాను అధిగమించింది. ఇదిలా ఉంటే, పిల్లలు పుట్టని దేశం గురించి ఎప్పుడైనా విన్నారా..? ఓ దేశంలో దాదాపు 95 ఏళ్లుగా బిడ్డలు పుట్టడం లేదు.. అవును.. ఆ దేశంలో ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు.. దీనికి కారణం ఏంటో తెలిస్తే..

ప్రపంచంలోనే అతి చిన్న దేశమైన వాటికన్ సిటీలో గత 95 ఏళ్లుగా ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు. ఈ దేశం మొత్తం వైశాల్యం 0.49 చదరపు కిలోమీటర్లు. మొత్తం జనాభా 764 మాత్రమే. ఇంత మంది ఉన్నా ఇక్కడ పిల్లలు ఎందుకు పుట్టడం లేదని మీరు అనుకోవచ్చు. అక్కడి కఠినమైన నిబంధనలే ఇందుకు కారణం. ఇక్కడ పిల్లలు పుట్టకూడదనేది వాటికన్ సిటీ నిబంధన. ఇక్కడ ఎక్కువ మంది పెళ్లి చేసుకోకుండా ఉంటున్న (పాస్టర్స్‌) పురోహితులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నందున వివాహం చేసుకోవడం, పిల్లల్ని కనడం నిషేధించబడింది. అంతేకాకుండా అక్కడ ఎవరైనా గర్భం దాల్చితే ప్రసవించేందుకు ఆసుపత్రులు కూడా లేవు. కాబట్టి ఈ దేశంలో గర్భం దాల్చినవారు ప్రసవ సమయంలో తప్పనిసరిగా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం.. గత 95 ఏళ్లుగా ఇక్కడ ఒక బిడ్డ కూడా పుట్టలేదు. ప్రసవం చేయాలంటే ఇటలీ వెళ్లాల్సిందే అనే ఈ నియమాన్ని ఇక్కడి ప్రజలు ఖచ్చితంగా పాటిస్తున్నారు.

వాటికన్ సిటీ కాథలిక్ చర్చి అధినేత పోప్ నివాసం కూడా. పిల్లల పుట్టుకపై మాత్రమే కాకుండా ఇక్కడ అకేక కఠినమైన పరిమితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ నివసించే స్త్రీ, పురుషులు మినీ స్కర్టులు, పొట్టి స్కర్టులు, షార్ట్‌లు, స్లీవ్‌లెస్ దుస్తులు ధరించరాదు. ఈ నగరంలో నివసించే చాలా మంది మహిళలు, వారి భర్తలు టీచర్లుగా, జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు. ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉన్నందున భద్రతా దళాలు లేవు. పోప్, అతని ప్యాలెస్‌ను రక్షించడానికి స్విస్ ఆర్మీకి చెందిన దాదాపు 130 మంది సైనికులు ఉంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి