Ramayan: 90వ దశకంలోని రామాయణానికి నేటికీ తగ్గని క్రేజ్.. శ్రీరాముడిగా నటించిన అరుణ్ గోవిల్ కు ఎయిర్ పోర్ట్ లో అరుదైన గౌరవం
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోలో.. అరుణ్ గోవిల్ విమానాశ్రయంలో ఉండగా.. ఒక మహిళ అతని పాదాలను తాకి నమస్కరించింది. అంతేకాదు ఆ మహిళతో పాటు.. మరికొందరు వ్యక్తులు కూడా నమస్కారం చేసి గౌరవం ఇచ్చారు
హిందూ పురాణాల్లో రామాయణ, మహాభారతాలు ప్రముఖ స్థానం ఉంది. మానవుడిగా పుట్టి.. దేవుడిగా కొలవబడుతున్న శ్రీరాముడి నేటి తరానికి కూడా ఆదర్శం.. అందుకనే రామాయణం మీద ఎన్ని సార్లు సినిమాలు తీసినా.. సీరియల్స్ వచ్చినా ఆదరణ సొంతం చేసుకుంటూనే ఉన్నాయి. ఇక 90వ దశకంలో బుల్లి తెరపై రామానంద్ సాగర్ రామాయణం ఓ సంచలనం. అయితే, దశాబ్దాల తర్వాత కూడా ఈ పౌరాణిక సీరియల్ కు ఉన్న ప్రజాదరణ కొంచెం కూడా తగ్గలేదు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో అందుకు నిదర్శనం. రాముడి పాత్రను పోషించిన నటుడు అరుణ్ గోవిల్ ఇటీవల విమానాశ్రయంలో కనిపించాడు. అయితే అక్కడ ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో అరుణ్ గోవిల్ తన వీరాభిమానుల్లో ఒకరిని ఢీకొట్టాడు. అప్పుడే ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోలో.. అరుణ్ గోవిల్ విమానాశ్రయంలో ఉండగా.. ఒక మహిళ అతని పాదాలను తాకి నమస్కరించింది. అంతేకాదు ఆ మహిళతో పాటు.. మరికొందరు వ్యక్తులు కూడా నమస్కారం చేసి గౌరవం ఇచ్చారు. తనకు అలా నమస్కరించడం అరుణ్ గోవిల్ అసౌకర్యంగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది. అనంతరం సర్దుకుని ఆ మహిళతో క్లుప్తంగా సంభాషించారు. ఆ మహిళ అర్జున్ గోవిల్ కు మోకరిల్లి నమస్కరించింది.
ట్విటర్‌లో వీడియోను పంచుకున్న అన్షుల్ సక్సేనా.. సరిగ్గా 35 సంవత్సరాల క్రితం రామాయణం 1987లో మొదటిసారి ప్రసారం చేయబడింది” అని రాశారు. ”శ్రీరాముడిగా అరుణ్ గోవిల్ నటించాడు. అతనికి ఇప్పుడు 64 ఏళ్లు.
Exactly 35 years ago, Ramayan aired for the first time in 1987.
Arun Govil played the role of Shri Ram. He is now 64 years old. pic.twitter.com/3jYE9Xe6yi
— Anshul Saxena (@AskAnshul) October 1, 2022
ఆన్‌లైన్‌లో వీడియో షేర్ చేసిన వెంటనే నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. కొంత మంది వినియోగదారులు ఈ వీడియో చాలా అందంగా ఉందని భావించారు. మరికొందరు శ్రీరాముడి పాత్రలో నటించిన అరుణ్ గోవిల్ ప్రశంసించారు. ఒకరు “అరుణ్ గోవిల్, నితీష్ భరద్వాజ్ శ్రీరాముడు , శ్రీకృష్ణుడిగా చాలా పర్ఫెక్ట్‌గా నటించారు. ఆ తర్వాత వీరిని ఇతర పాత్రల్లో చాలా మంది చూడలేకపోయారు. నేటికీ ఎవరైనా రాముడు లేదా కృష్ణుడు గురించి ప్రస్తావించినట్లయితే, మన మనస్సులో కనిపించేది వీరి ముఖాలు. వారి వారసత్వం అలాంటిది.నేను ఎప్పుడైనా @arungovil12ని కలిసినట్లయితే నేను కూడా ఇంతే చేస్తాను.. జై శ్రీ రామ్”. అంటూ రకరకాల కామెంట్స్ చేశారు.
రామాయణం 1987 నుండి 1988 వరకు ప్రసారమైన విజయవంతమైన టీవీ షోలలో ఒకటి. ఇది పురాతన ఇతిహాసం రామాయణం ఆధారంగా చిత్రీకరించబడింది. రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన రామాయణం సీరియల్ లో అరుణ్ గోవిల్, దీపికా చిఖాలియా, సునీల్ లహ్రీ , అరవింద్ త్రివేది నటించారు. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..