Viral News: హోటల్ గదిలో టెడ్డీ బేర్ వదిలేసిన అమ్మాయి.. తిరిగి తెచ్చుకోవడానికి వెళ్లి అక్కడ సీన్ చూసి దెబ్బకు షాక్..
అయితే ఓ అమ్మాయి తనతో తీసుకెళ్లిన టెడ్డీని హోటల్ గదిలో మర్చిపోయింది. ఆ తర్వాత తిరిగి తన బొమ్మ కోసం వెళ్లిన మహిళ అక్కడున్న సీన్ చూసి షాకయ్యింది.
టెడ్డీ బేర్లను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా అమ్మాయిలు, చిన్న పిల్లలు వీటిని తెగ ఇష్టపడతారు. ప్రతి అమ్మాయి గదిలో కచ్చితంగా ఓ టెడ్డీ బేర్ ఉండడం సహజం. వాటిని తమ స్నేహితులుగా.. ఆత్మీయులుగా భావిస్తారు. టెడ్డీ బేర్ పై అమితమైన ఇష్టాన్ని పెంచేసుకుంటారు. సన్నిహితులతో కలిసి ట్రిప్‌కు, వెకేషన్స్‌కు వెళ్లినప్పుడు తమ వెంటే టెడ్డీ బేర్‌ను తీసుకెళతారు. అయితే ఓ అమ్మాయి తనతో తీసుకెళ్లిన టెడ్డీని హోటల్ గదిలో మర్చిపోయింది. ఆ తర్వాత తిరిగి తన బొమ్మ కోసం వెళ్లిన మహిళ అక్కడున్న సీన్ చూసి షాకయ్యింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
@chocolatadisco అనే ట్విట్టర్ ఖాతా కలిగిన ఓ మహిళ తన టెడ్డీని తనతోపాటు ఓ హోటల్‌కు తీసుకెళ్లింది. ఆ తర్వాత ఆ బొమ్మను అక్కడే మర్చిపోయి తిరిగి ఇంటికి వెళ్లింది. ఆ మరుసటి రోజు తిరిగి తన బొమ్మను తీసుకోవడానికి హోటల్ గదికి వెళ్లింది. అక్కడ కనిపించిన సీన్ చూసి షాకయ్యింది. ఎందుకంటే హౌస్ కీపింగ్ వ్యక్తి ఆ బొమ్మను మంచంపై మనిషిలా దర్జాగా పడుకొబెట్టి దాని పక్కనే రిమోట్ కూడా పెట్టాడు. అలా తన బొమ్మను చూసి ఆమె ఎంతో సంతోషించింది. తన టెడ్డీని కెమెరాలో బంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ అసలు విషయం చెప్పేసింది. తాను మూడవ తరగతిలో ఉన్నప్పుడు ఆ బొమ్మను కొనుగోలు చేశానని.. తనకు ప్రస్తుతం 20 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆ టెడ్డీని మాత్రం వదిలిపెట్టలేదని.. టెడ్డీతో నిద్రపోతానని.. ఎక్కడకు వెళ్లిన టెడ్డీని తనతోపాటు తీసుకెళ్తానని చెప్పింది. ఇప్పటికీ ఆ టెడ్డీ తనవద్దే ఉందని సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
I LEFT MY TEDDY IN MY ROOM AND THE HOUSEKEEPER DID THIS??;!;!;!!;!; pic.twitter.com/IYRcLJxrfS
— myra ?askn信者 (@chocolatadisco) August 7, 2022
NO THAT REMINDS ME OF THE TIME I STAYED AT A HOTEL FOR DISNEY AND THE HOUSEKEEPER DID THIS? pic.twitter.com/CUn6zEcqQb
— Tally?{Commissions Open!} 3 weeks till? (@MentalBreze885) August 7, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.