Viral Video: మహిళ ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. లారీ ఢీకొని ఎగిరిపడ్డా మృత్యువు నుంచి ఎలా తప్పించుకుందో మీరే చూడండి..
వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటించాలని, డ్రైవింగ్ సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని ప్రభుత్వాలు నొక్కి చెబుతున్నాయి.
వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటించాలని, డ్రైవింగ్ సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని ప్రభుత్వాలు నొక్కి చెబుతున్నాయి. అయినా ఇవి కొంతమంది చెవులకెక్కడం లేదు. అజాగ్రత్త, అలక్ష్యంతో తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా గాల్లో కలిపేస్తున్నారు. అదే సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ధరించి ప్రాణాపాయం నుంచి బయటపడినవారు చాలామందే ఉన్నారు. తాజాగా ఒక మహిళ కూడా హెల్మెట్ ధరించి త్రుటిలో మృత్యువు బారి నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో (Viral Video) సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ యాక్సిడెంట్ కర్ణాటక (Karnatka) లోని మణిపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ మహిళ స్కూటీపై రోడ్డును దాటేందుకు ప్రయత్నించింది. అయితే అదే సమయంలో అటువైపుగా ఓ లారీ స్పీడ్‌గా దూసుకొచ్చింది. అయితే ఆ లారీ వస్తున్నది గమనించకుండా ఆ మహిళ అలాగే ముందుకు దూసుకెళ్లింది. దీంతో రెప్పపాటులో లారీ ఆమెను ఢీకొంది.
ఈ ప్రమాదంలోస్కూటీ తీవ్రంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఈ యాక్సిడెంట్‌లో ఆ మహిళ స్వల్పగాయాలతో బయపడింది. లాడీ ఢీకొని కింద పడిన మహిళ కొన్ని సెకన్లలోనే లేచి నిలబడి హెల్మెట్ సరిచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆతర్వాత కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. కాగా అంతటి ప్రమాదంలోనూ ప్రాణాలతో బయట పడిందంటే అందుకు ఆమె ధరించిన హెల్మెట్ కారణమని ఈ వీడియో చూసిన నెటిజన్లు అంటున్నారు. కాగా మహిళలను ఢీకొట్టిన లారీ డ్రైవర ఆపకుండా ముందుకు వెళ్లిపోవడం గమనార్హం. అయితే ఈ ఘటనపై బాధిత మహిళ నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మణిపాల్ పోలీసులు అంటున్నారు.
CCTV footage captures the miraculous escape of a woman after being hit by a truck transporting milk in Perampalli near Manipal on Tuesday.
The woman crossing the road has survived with only minor injuries.
? Wear helmets, ride safely! ?? pic.twitter.com/Qowng4ces3
— Mangalore City (@MangaloreCity) March 12, 2022
Also Read:Viral Video: నెలల నిండు గర్భంతో పురుషుడు !! నోరెళ్లబెడుతున్న జనం !! వీడియో
Paytm Payments Bank: డేటా మొత్తం భద్రంగానే ఉంది.. ఆర్బీఐ నిబంధనలు పాటిస్తున్నాం: పేటీఎం
Elon Musk Vs Putin: రష్యా అధ్యక్షుడికి ఎలాన్ మస్క్ ఛాలెంజ్.. ట్విట్టర్ లో కీలక వ్యాఖ్యలు..