Viral Video: మొసలి మాంసాన్ని ఫ్రై చేసి లొట్టలేసుకుంటూ తిన్న యువతి.. సృష్టిలో ఏ జీవిని వదలరుగా అంటున్న నెటిజన్లు..
మొసళ్లు మనుషులను తినేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే.. అయితే మనుషులు మొసలి మాంసాన్ని తినడం మీరు ఎప్పుడైనా విన్నారా లేదా చూసారా? అవును అలాంటి వీడియో ఒకటి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్రజలను షాక్‌కు గురి చేసింది. నిజానికి ఈ వీడియోలో ఒక మహిళ మొసలి మాంసాన్ని వండుకుని తింటోంది.
ప్రపంచంలోని ప్రమాదకరమైన జంతువుల్లో మొసళ్ల కూడా ఒకటి. నీటిలో మాత్రమే కాదు నేలమీద కూడా సంచరించే మొసళ్లు జంతువులను, మనుషులను కూడా వేటాడతాయి. భారీ మొసళ్ళు మనుషులను మింగిన వార్తల గురించి తరచుగా వార్తలు వింటూనే ఉన్నాం. మానవులు ఈ జంతువు నుండి దూరంగా ఉండటానికి, జంతుప్రదర్శనశాల్లో కూడా మొసళ్ళను ఎన్‌క్లోజర్ లోపల ఉంచడానికి ఇదే కారణం. తద్వారా మొసళ్లను సందర్శించే వ్యక్తులు సురక్షితంగా ఉంటారు. మొసళ్లు మనుషులను తినేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే.. అయితే మనుషులు మొసలి మాంసాన్ని తినడం మీరు ఎప్పుడైనా విన్నారా లేదా చూసారా? అవును అలాంటి వీడియో ఒకటి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్రజలను షాక్‌కు గురి చేసింది.
నిజానికి ఈ వీడియోలో ఒక మహిళ మొసలి మాంసాన్ని వండుకుని తింటోంది. ఆ మహిళ ఎక్కడి నుంచో పెద్ద మొసలి తోకను తెచ్చి (బహుశా కొని ఉండవచ్చు) దానిని మొదట రుద్ది నీళ్లతో కడుగుతూ, శుభ్రం చేసింది. ఇది వీడియోలో చూడవచ్చు. ఆ తరువాత ఆమె తన చేతులతో దానిపై ఉన్న గరుకు, మందపాటి చర్మాన్ని తీసివేసి, ఆపై మాంసం కోసే ఆయుధంతో చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది. ఆ ముక్కలు చూడడానికి చేపల ముక్కలుగా కనిపిస్తాయి. అనంతరం స్త్రీ ఆ మొసలి మాసం ముక్కలను నూనెలో బాగా వేయించి, తినడానికి కూర్చుంది. ఆమె మొసలి మాంసాన్ని రుచికరమైనదిగా భావించినట్లు ఉంది.. అందుకనే ఆ మాంసాన్ని చాలా ఇష్టంగా ఆస్వాదిస్తూ అనేక ముక్కలను తింది.
వీడియో చూడండి
View this post on Instagram
చుడానికి భయం.. అసహ్యం అనిపించే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ting_tong80 అనే IDతో భాగస్వామ్యం చేయబడింది. ఇది ఇప్పటివరకు 2.5 మిలియన్లు లేదా 25 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుంది. అదే సమయంలో 35 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు.
వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ‘మొసలిని ఆసియా , ఆఫ్రికా, ఆస్ట్రేలియా , అమెరికా ఇలా అనేక దేశ ప్రజలు తింటారని కొంతమంది వినియోగదారులు చెబుతుండగా, ‘ అసలు ఈ వ్యక్తులు సృష్టిలో తినని జీవి ఏమైనా ఉందా అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని ట్రేండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..