AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఓరినీ ఇదెక్కడి సిత్రం మావా.. కుక్కల్లా మొరుగుతున్న వందలాది మంది జనాలు.. షాకింగ్ వీడియో..

Latest Viral Video: బుర్రకో బుద్ధి.. జివ్హకో రుచి అంటారు. ఎవడి టాలెండ్ వాడిది.. ఎవరి అభిప్రాయం వారిది. ఇంత పెద్ద భూ ప్రపంచంలో ఒక్కోక్కరిది ఒక్కో ప్రపంచం.. ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అయితే, కోట్లాది మందిలో కొందరి అభిప్రాయాలు కలుస్తాయి. వారంతా ఒకే విధమైన అంశాలపై ఆసక్తి కనబరుస్తుంటారు. కొందరు గుర్తింపు కోసం ఏదైనా విచిత్రంగా చేయాలని భావిస్తుంటారు. తమ ప్రత్యేకమైన ఆలోచనా విధానంతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. తాజాగా కొందరు వ్యక్తుల సమూహం కూడా ఇదే రకమైన పని చేసింది.

Watch Video: ఓరినీ ఇదెక్కడి సిత్రం మావా.. కుక్కల్లా మొరుగుతున్న వందలాది మంది జనాలు.. షాకింగ్ వీడియో..
Canine Beings
Shiva Prajapati
|

Updated on: Sep 25, 2023 | 4:39 PM

Share

Latest Viral Video: బుర్రకో బుద్ధి.. జివ్హకో రుచి అంటారు. ఎవడి టాలెండ్ వాడిది.. ఎవరి అభిప్రాయం వారిది. ఇంత పెద్ద భూ ప్రపంచంలో ఒక్కోక్కరిది ఒక్కో ప్రపంచం.. ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అయితే, కోట్లాది మందిలో కొందరి అభిప్రాయాలు కలుస్తాయి. వారంతా ఒకే విధమైన అంశాలపై ఆసక్తి కనబరుస్తుంటారు. కొందరు గుర్తింపు కోసం ఏదైనా విచిత్రంగా చేయాలని భావిస్తుంటారు. తమ ప్రత్యేకమైన ఆలోచనా విధానంతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. తాజాగా కొందరు వ్యక్తుల సమూహం కూడా ఇదే రకమైన పని చేసింది. అందరిలో ఉంటే మనకేం ప్రత్యేకత అనుకున్నారో ఏమో గానీ.. దాదాపు 1000 మందికిపైగా జనాలు కుక్కల్లా మారిపోయారు. కుక్కలు మొరిగినట్లే వీధుల్లో మొరుగుతూ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జర్మనీలోని బెర్లిన్ పోట్స్ డామర్ ప్లాట్జ్ రైల్ రోడ్ స్టేషన్‌లో కొందరు వ్యక్తులు కుక్కల వేషంలో రచ్చ చేశారు. యూరప్‌లో ఫోల్జో్మ్ సందర్భంగా వీరు ఇలా శునక వేషధారణలో హడావుడి క్రియేట్ చేశారు. అయితే, వీరంతా స్వలింగ సంపర్కులుగా తెలుస్తోంది. వివిధ ఆసక్తులు కలిగిన ఈ స్వలింగ సంపర్కులు ఒకే వేదిక వద్దకు వచ్చి రచ్చ చేశారు. చాలా మంది కాస్‌ప్లేయింగ్ చేస్తున్నారు. ఫెటిష్ దుస్తులు ధరించి, కుక్కల వేషంలో హంగామా చేశారు. వీరికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే, ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. జంతు నియంత్రణ చేయాల్సిందే అని కొందరు కామెంట్స్ చేస్తే.. ఈ కుక్కల రోజువారీ అవసరాలను ఎలా తీర్చుకుంటాయి అంటూ హాస్యాస్పదంగా రియాక్ట్ అవుతున్నారు.

ఇదిలాఉంటే.. గతంలో జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి తనను తాను కుక్కలా మార్చుకోవాలనే ఆసక్తితో 14,000 డాలర్లపై పైచిలుకు ఖర్చు చేశాడు. అంతేకాదు.. ఇతరులు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయాలంటూ ప్రోత్సహించాడు. ‘థేరియన్ ఇజం’ను అన్వేషించాలని సూచించాడు. మనుషులు కుక్కల్లాగా ప్రవర్తించడం కాకుండా.. మరేదైనా కొత్తగా గుర్తించాలని, ఆ కోరిక బలంగా ఉందని పిట్స్‌బర్గ్‌లోని డుక్వెస్నే యూనివర్సిటీకి చెందిన సైకాజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎలిజిబెత్ ఫీన్ తెలిపాడు.

మొత్తంగా ఈ సమూహానికి చెందిన వ్యక్తులు.. కుక్కల్లా వేషాలు వేసుకుని రచ్చ చేయడంతో దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో రచ్చ చేస్తోంది.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..