AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వర్షం నీటితో నిండిన రోడ్డు.. బట్టలు తడుస్తాయని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఏం చేశాడో తెలుసా.. ఏకిపారేస్తోన్న నెటిజన్స్..

వర్షం నీటిలో నడిచి వెళ్తే తన బట్టలు తడుస్తాయని భావించిన ఒక మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎవరూ ఊహించని పని చేశాడు. అతడు చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. వరద నీటిలో దుస్తులు తడవకుండా ఉండేందుకు ప్రిన్సిపల్‌ను స్ట్రెచర్‌పై కూర్చొబెట్టుకుని బయటకు తీసుకెళ్లారు సిబ్బంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ సందర్భంగా అతను తన ముఖం కనిపించకుండా ఉండేందుకు కర్చీఫ్‌ అడ్డుగా పెట్టుకునే ప్రయత్నం చేశారు. కాగా,

Watch: వర్షం నీటితో నిండిన రోడ్డు.. బట్టలు తడుస్తాయని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఏం చేశాడో తెలుసా.. ఏకిపారేస్తోన్న నెటిజన్స్..
Medical College Principal
Jyothi Gadda
|

Updated on: Jul 14, 2024 | 6:12 PM

Share

దేశంలోని చాలా రాష్ట్రాల్లో రుతుపవనాలు ఆలస్యంగానైనా సరే విస్తృతంగా కురుస్తున్నాయి. వర్షం కారణంగా అనేక చాలా చోట్ల వరద నీరు ముంచేత్తుతోంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, ఆఫీసులు, ఆసుపత్రుల్లో భారీగా వరద నీరు చేరింది. వర్షం నీటిలో నడిచి వెళ్తే తన బట్టలు తడుస్తాయని భావించిన ఒక మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎవరూ ఊహించని పని చేశాడు. అతడు చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. వరద నీటిలో దుస్తులు తడవకుండా ఉండేందుకు ప్రిన్సిపల్‌ను స్ట్రెచర్‌పై కూర్చొబెట్టుకుని బయటకు తీసుకెళ్లారు సిబ్బంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో షాజహాన్‌పూర్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి కూడా నీట మునిగింది. ఈ నేపథ్యంలో తన కారు వద్దకు నీటిలో నడిచి వెళ్లేందుకు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ రాజేష్ కుమార్‌ సంశయించారు. దుస్తులు నీటిలో తడవకుండా ఉండేందుకు స్ట్రెచర్‌పై బయటకు వెళ్లారు. ఒక స్ట్రెచర్‌పై ఆయన కూర్చోగా సిబ్బంది దానిని లాక్కెళ్లారు. రాజేష్ కుమార్‌ బ్యాగ్‌, ఇత్తర వస్తువులను కూడా మరో స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అతను తన ముఖం కనిపించకుండా ఉండేందుకు కర్చీఫ్‌ అడ్డుగా పెట్టుకునే ప్రయత్నం చేశారు. కాగా, ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ రాజేష్ కుమార్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఇవి కూడా చదవండి

అయితే ఈ విమర్శలను ఆయన ఖండించారు ప్రిన్సిపల్‌ రాజేష్‌ కుమార్. తన చర్యను సమర్థించుకున్నారు. షాజహాన్‌పూర్‌ను వరదలు ముంచెత్తడంతో మెడికల్‌ కాలేజీ కూడా జలమయమైందని చెబుతూ.. సుమారు 300 మంది రోగులు, సిబ్బంది, ఇతరులు ఇక్కడ వర్షం నీటిలో చిక్కుకున్నారని చెప్పారు. మరోవైపు అంబులెన్స్‌లు, బస్సుల ద్వారా రోగులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నట్లు రాజేష్ కుమార్‌ తెలిపారు.

ఆస్ప్రతిలో అకస్మత్తుగా వర్షపు నీరు భయంకరంగా పెరిగిందని చెప్పారు.. అంబులెన్స్‌ ద్వారా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించానని, తన కాలికి గాయం ఉందన్నారు. తనకు మధుమేహం కూడా ఉందని చెప్పారు.. దాని కారణంగా నేను నడవలేకపోతున్నా. నా వద్ద పని చేసే సిబ్బందితో మాట్లాడా. స్ట్రెచర్‌పై తీసుకెళ్తామని వారు చెప్పారు. మెడికల్ కాలేజీ నుంచి స్ట్రెచర్‌పై బయటకు వచ్చా’ అని అన్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి