Viral Video: భారతీయ సంగీతానికి ఆ విమానాశ్రయ అధికారులు ఫిదా.. అడిగిమరీ..
భారతీయ సంగీతమంటే నచ్చని వారెవరుంటారు. బాలీవుడ్ పాటలంటే ఎంతో ఇష్టంగా వింటారు. కేవలం మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ భారతీయ సంగీతానికి ఎంతో మంది అభిమానులున్నారు. ఈమధ్య కాలా చష్మా పాట..
Viral News: భారతీయ సంగీతమంటే నచ్చని వారెవరుంటారు. బాలీవుడ్ పాటలంటే ఎంతో ఇష్టంగా వింటారు. కేవలం మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ భారతీయ సంగీతానికి ఎంతో మంది అభిమానులున్నారు. ఈమధ్య కాలా చష్మా పాట ఎంత ఫ్యామస్ అయిందో అందరికీ తెలిసిందే. విదేశాల్లో సైతం ఈపాటకు డ్యాన్స్ చేయడం వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్ కు చెందిన ఓ సంగీత వాయిద్యకారుడు తన సంగీత వాయిద్య సాధానాలతో అజర్ బైజాన్ విమానశ్రయం నుంచి భారత్ కు వస్తుండగా.. అజర్ బైజాన్ విమానాశ్రయంలోని భద్రతా సిబ్బంది తమ చెకింగ్ లో గిటారును గుర్తించారు. వెంటనే ఓ పాట పాడాలని ఆ భారతీయ ప్రయాణీకుడిని అడగ్గా అధికారుల అభ్యర్థన మేరకు ఆ ప్రయాణీకుడు ఆషికీ 2లోని ‘తుమ్ హి హో అనే సూపర్‌హిట్ పాట పాడటంతో పాటను పాడాడు. ఈకళాకారుడు తన గిటారును వాయిస్తూ తుమ్ హి హో అనే పాటను పాడిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ వీడియో క్లిప్ ను కబీర్ అనే కళాకారుడు తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. తనకు విమానశ్రయంలో ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఈపోస్టు చేశాడు. కబీర్ పాటకు విమానశ్రయ అధికారులు ఎగిరి గంతేసారు. ఈపాటకు ఎయిర్ పోర్టు అధికారులు సంతోషం వ్యక్తం చేయడం వీడియోలో కనిపిస్తోంది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..