Viral News: కోట్లు ఖర్చుపెట్టి లాటరీ టికెట్లు కొంటున్నాడు.. 52 ఏళ్లైనా వరించని అదృష్టం..
అదృష్టం ఉంటే రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావచ్చనే ఆశతో చాలా మంది లాటరీ టికెట్లు కొంటుంటారు. వంద రూపాయల కంటే తక్కువతో లాటరీ టికెట్టు కొంటే డ్రాలో తమ పేరొస్తే కోట్లు వస్తాయనే ఆశతో చాలా మంది తమ..
Viral News: అదృష్టం ఉంటే రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావచ్చనే ఆశతో చాలా మంది లాటరీ టికెట్లు కొంటుంటారు. వంద రూపాయల కంటే తక్కువతో లాటరీ టికెట్టు కొంటే డ్రాలో తమ పేరొస్తే కోట్లు వస్తాయనే ఆశతో చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అయితే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కొంత పరిమితి ఉంటుంది. ఎవరైనా వందలు పెట్టి కోట్ల రూపాయలు అర్జించాలని లాటరీ కొంటారు. కాని ఓ వ్యక్తి మాత్రం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కొన్నేళ్లుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు. 50 ఏళ్లలో గరిష్టంగా రూ.5,000 బహుమతిని మాత్రమే గెల్చుకున్నాడు. అయినా ఎప్పటికైనా తనను అదృష్టం వరిస్తుందనే ఆశతో లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడు. లాటరీ టికెట్లు కొనడం ద్వారా తన సంపాదనలో కొంత మొత్తం ఖర్చు అయిపోతుందని తెలిసినా, ప్రతి నెల తనకు వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని లాటరీ టికెట్ల కోసం కేటాయిస్తున్నాడు. 50 ఏళ్లుగా అదృష్టం వరించకపోయినా.. భారీ స్థాయిలో నగదు గెలవకపోయినా తాను కొన్న అన్ని లాటరీ టికెట్లను భద్రపరుచుకుంటున్నాడు. ఇంతకీ లాటరీలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన ఆ వ్యక్తి స్టోరీ ఎంటో తెలుసుకుందాం.
కేరళలోని కన్నూర్ కు చెందిన రాఘవన్ లాటరీలో అదృష్టం వరిస్తే జీవితంలో స్థిరపడిపోవచ్చులే అనే ఆశతో లాటరీ టికెట్లు కొనడం మొదలు పెట్టాడు.తనకు 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి లాటరీ టికెట్లు కొనడం మొదలుపెట్టాడు. అతడి వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు.. గత 52 ఏళ్లుగా లాటరీల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటివరకు తన ఆశ మాత్రం నెరవేరలేదు. అయినా సరే తాను లాటరీ టికెట్లు కొనడం మాత్రం ఆపనని చెబుతున్నాడు రాఘవన్. ఇప్పటివరకు రాఘవన్ లాటరీ టికెట్లు కొనడం కోసం ఎంత ఖర్చు చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే. లక్షా, రెండు లక్షలు కాదు, ఏకంగా రూ.3.5 కోట్ల రూపాయలు ఖర్చుచేసి లాటరీ టికెట్లను కొన్నాడు. 50 ఏళ్లుగా తన ప్రయత్నాలు చేస్తున్నప్పటికి.. ఇప్పటివరకు లాటరీల్లో అతను గెలుచుకున్న గరిష్ఠ బహుమతి రూ.5వేలు మాత్రమే.
తనకు వచ్చే ఆదాయంలో కొంతమొత్తాన్ని లాటరీ టికెట్ల కోసం ఖర్చు చేస్తున్నాడు. కేరళలో అత్యంత ఖరీదైన ఓనమ్ బంపర్ లాటరీని కూడా అతడు కొనుగోలు చేశాడు. ఆ టికెట్లన్నీ భద్రంగా గోనె సంచుల్లో నిల్వ చేసి అదృష్టం కోసం వేచి చూస్తూనే ఉన్నాడు. రాఘవన్ ఆశతో లాటరీ టికెట్లు కొంటుంటే అతగాడికి అర్థంగి మద్దతు కూడా ఉంది. ఎప్పటికైనా తన భర్తకు అదృష్టం కలిసి వస్తుందని రాఘవన్ భార్య శాంత ఆశాభావంతో ఉంది. అయితే లాటరీలో కోట్ల రూపాయలు సంపాదించవచ్చనే ఆశతో రాఘవన్ ఏకంగా రూ.3.5కోట్లు ఖర్చు చేశాడన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఇవ్వబడింది. లాటరీలతో తలరాతలు మార్చుకోవాలని TV9 తెలుగు సిఫార్సు చేయదు)
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..