తవ్వకాల్లో బయటపడిన అద్భుతం !! శ్రీరాముడిచే పూజలందుకున్న శివలింగం !!
తమిళనాడులో అద్భుత ఘటన వెలుగుచూసింది. పరమ శివుడి పురాతన లింగం పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. దీంతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. హరహర మహాదేవ.. శంభో శంకర..
తమిళనాడులో అద్భుత ఘటన వెలుగుచూసింది. పరమ శివుడి పురాతన లింగం పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. దీంతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. హరహర మహాదేవ.. శంభో శంకర.. అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. శివగంగ జిల్లా నానామడైలో ఈ ఘటన వెలుగుచూసింది. కాగా ఈ అద్భుత లింగం గురించిన విశేషాలను పురావస్తు శాఖ అధికారి సెంధిల్‌మురుగన్ వివరించారు. సీతమ్మను దుష్ట రావణాసురుడి చెర నుంచి విడిపించేందుకు.. వానర సైన్యంతో కలిసి శ్రీరామచంద్రుడు లంకకు బయలుదేరాడు. మార్గమధ్యంలో తమకు విజయం చేకూరాలని అనేక చోట్ల.. శివలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్లు పూర్వికుల ద్వారా తెలిసిందని సెంధిల్‌మురుగన్ వెల్లడించారు. ఈ క్రమంలోనే రాములవారు.. తమిళనాడు గుండా వెళ్లినప్పుడు.. నానామడై వద్ద ప్రతిష్ఠించిన శివలింగం కాలక్రమంలో భూగర్భంలోకి వెళ్లిందని తెలిపారు. ఆ అద్భుత లింగం తాజాగా జరిపిన తవ్వకాల్లో బయటపడిందని.. వివరించారు. దీంతో అది సాక్షత్తూ శ్రీరామచంద్రుడు పూజించిన లింగంగా భావించి.. స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చి పూజలు చేస్తున్నారు. రాముడు నడయాడిన ఈ ప్రాంతంలో మరిన్ని పరిశోధనలు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే.. శివలింగం బయల్పడిన చోట గుడి నిర్మాణానికి పూనుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓ కేసులో రహస్య లాకర్లు ఓపెన్ చేసిన ఈడీ అధికారులు.. చూస్తే కళ్లు బైర్లు
మమ్మీ.. నువ్వు మేకప్ తీయొద్దు.. నేను చూడలేను !! నెట్టింట వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో
నీటికోసం వెళ్లి బురదలో కూరుకుపోయిన ఏనుగులు !! హృదయాన్ని కదిలిస్తున్న దృశ్యం..
క్రమం తప్పకుండా స్కూలుకి వెళ్తున్న కొండముచ్చు.. 100 % అటెండెన్స్ !!
కండక్టర్‌ను ఉతికారేసిన పాసింజర్.. ఎందుకో తెలుసా ??