ఓ కేసులో రహస్య లాకర్లు ఓపెన్ చేసిన ఈడీ అధికారులు.. చూస్తే కళ్లు బైర్లు
బ్యాంకుల నుంచి మోసపూరిత వైఖరితో లోన్లు తీసుకున్న కేసులో.. మనీ లాండరింగ్ అభియోగాలపై రక్ష బులియన్ అండ్ క్లాసిక్ మార్బుల్స్ సంస్థ కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది.
బ్యాంకుల నుంచి మోసపూరిత వైఖరితో లోన్లు తీసుకున్న కేసులో.. మనీ లాండరింగ్ అభియోగాలపై రక్ష బులియన్ అండ్ క్లాసిక్ మార్బుల్స్ సంస్థ కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. సోదాలకు వెళ్లిన ఈడీ బృందానికి కళ్లు బైర్లు కమ్మాయి. రహస్య లాకర్లలో ఏకంగా 431 కిలోల బంగారు, వెండి కడ్డీలు బయటపడ్డాయి. వీటిలో 91.5 కిలోలు బంగారం. 340 కిలోల వెండి ఉంది. వీటి విలువ దాదాపు 48 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రూల్స్ ఫాలో అవ్వకుండానే ఈ లాకర్లు నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ముంబైకి చెందిన పరేఖ్ అల్యుమినెక్స్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించి కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. బ్యాంకుల నుంచి 2వేల 296 కోట్లు లోన్‌లు తీసుకుని మోసం చేసినట్టు.. 2018లో కేసు నమోదైంది. తర్వాత పలు షెల్ కంపెనీల ముసుగులో ఈ మొత్తాన్ని విదేశాలకు తరలించాలన్నది అభియోగం. దీనికి సంబంధించి గతంలోనే కంపెనీకి సంబంధించిన 205 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మమ్మీ.. నువ్వు మేకప్ తీయొద్దు.. నేను చూడలేను !! నెట్టింట వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో
నీటికోసం వెళ్లి బురదలో కూరుకుపోయిన ఏనుగులు !! హృదయాన్ని కదిలిస్తున్న దృశ్యం..
క్రమం తప్పకుండా స్కూలుకి వెళ్తున్న కొండముచ్చు.. 100 % అటెండెన్స్ !!
కండక్టర్‌ను ఉతికారేసిన పాసింజర్.. ఎందుకో తెలుసా ??
సివంగితో మామూలుగా ఉండదు మరి.. అడవికి రాజైనా తోక ముడవాల్సిందే..