సివంగితో మామూలుగా ఉండదు మరి.. అడవికి రాజైనా తోక ముడవాల్సిందే..
భార్యాభర్తల మధ్య ఎన్నో ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటాయి. పెళ్లయ్యాక భార్యకు భర్త భయపడాల్సిందే అని చెప్పే మీమ్స్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
భార్యాభర్తల మధ్య ఎన్నో ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటాయి. పెళ్లయ్యాక భార్యకు భర్త భయపడాల్సిందే అని చెప్పే మీమ్స్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇది మనుషులకే కాకుండా జంతువులకు కూడా వర్తిస్తుందనే విషయాన్ని కొన్ని వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఆడ సింహం ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంది. అప్పుడే అక్కడికి ఓ మగ సింహం వచ్చింది. నిద్రపోతున్న సింహాన్ని భయపెట్టాలనుకుని అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చింది. కొంచెం కూడా సౌండ్ రానీయకుండా పక్కా ప్లాన్ తో వెళ్లి నిద్రిస్తున్న సింహాన్ని లేపేందుకు ప్రయత్నించింది. దాంతో చిర్రెత్తుకొచ్చిన ఆడ సింహం వెంటనే లేచి గట్టిగా గర్జిస్తూ ఎట్టాక్ చేసింది. ఈ హఠాత్పరిణామానికి రారాజు వెనక్కు తగ్గక తప్పలేదు. ఈ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా బాగా లైక్ చేస్తున్నారు. లక్షలమంది ఈ వీడియోను వీక్షిస్తూ తమ స్నేహితులకు షేర్ చేస్తున్నారు. అంతే కాకుండా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సింహం అయినా, మనిషి అయినా భార్య ముందు మ్యావ్….అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్రిల్స్ మధ్యలో ఇరుక్కున్న కుక్క.. సాయం చేసిన పిల్లి..
రైల్లో చోరీకి యత్నం.. దొంగకు చుక్కలు చూపించిన ప్రయాణికుడు !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

