రైల్లో చోరీకి యత్నం.. దొంగకు చుక్కలు చూపించిన ప్రయాణికుడు !!
రైల్లో చోరీకి యత్నించిన ఓ వ్యక్తికి చుక్కలు చూపించాడో ప్రయాణికుడు.. కిటికీలోంచి సెల్‌ఫోన్‌ను కాజేసేందుకు యత్నించిన అతని చేయిని గట్టిగా దొరకబుచ్చుకోవడంతో..
రైల్లో చోరీకి యత్నించిన ఓ వ్యక్తికి చుక్కలు చూపించాడో ప్రయాణికుడు.. కిటికీలోంచి సెల్‌ఫోన్‌ను కాజేసేందుకు యత్నించిన అతని చేయిని గట్టిగా దొరకబుచ్చుకోవడంతో.. నిందితుడు అలాగే రైలు బయట గాల్లో వేలాడుతూ కొన్ని కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ క్రమంలోనే ప్రయాణికులు అతని రెండు చేతులూ లోపలికి లాగిపట్టుకుని.. దారిలో కిందపడిపోకుండా కాపాడారు. దీంతో ఏకకాలంలో అతనికి గుణపాఠంతోపాటు ప్రాణభిక్ష లభించినట్లయింది. ఈ ఘటన బీహార్‌లో వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తోన్న ఓ రైలు.. సాహెబ్‌పూర్ కమాల్ స్టేషన్‌లో ఆగినప్పుడు ఓ వ్యక్తి కిటికీలోంచి ఓ ప్రయాణికుడి సెల్‌ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. కానీ, అప్రమత్తంగా ఉన్న ప్రయాణికుడు.. వెంటనే అతని చేయిని గట్టిగా పట్టుకున్నాడు. ఒకవైపు రైలు కదులుతుండటం.. మరోవైపు చేయిని విడిచిపెట్టకపోవడంతో.. అతను వదిలేయాలంటూ వేడుకున్నాడు. ఈ క్రమంలోనే రైలు ప్లాట్‌ఫాం దాటింది. దీంతో అతను బయటే వేలాడాడు. దాదాపు ఇలా దాదాపు 10 కిలోమీటర్లపాటు అతను కదులుతున్న రైలు బయట గాల్లోనే వేలాడాడు. చివరకు రైలు ఖగారియా సమీపించినప్పుడు.. అతన్ని విడిచిపెట్టారు. వెంటనే అతను పారిపోయినట్లు స్థానికులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెట్టింట తన న్యూడ్ వీడియో !! ఎమోషనలైన హీరోయిన్
RRRకి బిగ్ షాక్ !! భారత్ నుంచి ఆస్కార్‌కు గుజరాతీ మూవీ !!
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 75కే మల్టీప్లెక్సుల్లో మూవీ చూసే ఛాన్స్.!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

