Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: “ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా” అంటున్న డేవిడ్ వార్నర్.. వైరల్‎గా మారిన వీడియో..

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‎మెన్లలో ఒక్కడు. అతను ఐపీఎల్‎తో భారత క్రికెట్ అభిమానులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా తెలుగు అభిమానులకు చాలా దగ్గరయ్యాడు....

Viral Video: ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా అంటున్న డేవిడ్ వార్నర్.. వైరల్‎గా మారిన వీడియో..
Warner
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 12, 2021 | 7:47 AM

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‎మెన్లలో ఒక్కడు. అతను ఐపీఎల్‎తో భారత క్రికెట్ అభిమానులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా తెలుగు అభిమానులకు చాలా దగ్గరయ్యాడు. అతుడు తెలుగు పాటలకు డ్యాన్స్ కూడా చేశాడు. వార్నర్ తాజాగా ఇన్‎స్టాగ్రామ్‎లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‎గా మారింది. యాషెస్ సిరీస్ మొదటి టెస్ట్‎లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ గెలుపులో వార్నర్ కీలకంగా ఉన్నాడు. అతును 94 పరుగులతో రాణించాడు.

వార్నర్ ఇన్‎స్టాగ్రామ్‎లో ఓ వీడియో పెట్టాడు. అందులో అతను పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వలే మార్ఫింగ్ చేసి ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా పాటతో వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియా వైరలయింది. ఈ వీడియోకు అభిమానుల నుండి మంచి స్పందన లభించింది. కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి వార్నర్ సోషల్ మీడియా చురుగ్గా ఉంటున్నారు. అతని మార్ఫింగ్ వీడియోలకు ప్రసిద్ధి చెందాడు. ఈ పోస్ట్‌కి విరాట్ కోహ్లీ నుంచి ఒక వ్యాఖ్య కూడా వచ్చింది. అతను “మేట్ బాగున్నారా?” కోహ్లీ వ్యాఖ్యలతో పాటు నవ్వుల ఎమోజీ కూడా ఉంది.

శనివారం పోస్ట్ చేసినటువంటి వీడియోలను ఉపయోగించి భారత క్రికెట్ అభిమానులకు సేవలందిస్తున్నందుకు చాలా మంది అభిమానులు వార్నర్‌ను ప్రశంసించారు. బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగిన యాషెస్ ఓపెనర్‌లో వార్నర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 35 ఏళ్ల అతను మొదటి మ్యాచ్‎లో గాయం అయినట్టు తెలిసింది. అతను రెండో టెస్ట్ మ్యాచ్‌కు దూరంగా ఉండవచ్చు. ముందుజాగ్రత్త చర్య కారణంగా అతను రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు. రెండవ మ్యాచ్ అడిలైడ్ ఓవల్‌లో డిసెంబర్ 16న ప్రారంభమవుతుంది.

Read Also… Cricket: ముగ్గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్.. ఐసోలేషన్‎లో ఉన్న ఆ ఆటగాళ్లు ఎవరంటే..