Madhya Pradesh: తమపై అరచిందని కుక్కని కొట్టిన యువకులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Madhya Pradesh: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే వెలుగులోకి వచ్చేస్తుంది. తాజాగా ఓ కుక్కను కొంతమంది యువకులు..
Madhya Pradesh: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే వెలుగులోకి వచ్చేస్తుంది. తాజాగా ఓ కుక్కను కొంతమంది యువకులు కొడుతుంటే ఓ బాలిక అడ్డుపడింది. దీంతో ఆ దుండగులకు అహం అడ్డువచ్చి.. ఆ బాలికపై తమ కోపాన్ని చూపిస్తూ.. విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌లోని గర్హా పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న సమస్య తలెత్తింది. దీంతో కొందమంది దుండగులు బాలికలను కొట్టారు. ఇదే విషయంపై బాధిత బాలిక మేనమామ అర్జున్ సింగ్ మాట్లాడుతూ.. నిందితులు రాత్రి వేళ బైక్‌ల మీద అతి వేగంతో తన ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నారని తెలిపారు. ఆ నిందితులు తమ ఇంటిని దాటగానే.. తమ పెంపుడు కుక్క వారిపై మొరగడం ప్రారంభించింది. దీంతో ఆగ్రహించిన నిందితుడు రాడ్‌తో కుక్కను కొట్టాడు. దీంతో బాధిత బాలిక ఇంటిలో నుంచి బయటకు ఎందుకు కొట్టారంటూ వారిని ప్రశ్నించింది. దీంతో నిందితులు బాలికను నోటికి వచ్చినట్లు దుర్భాషలాడడం మొదలుపెట్టారని చెప్పారు అర్జున్ సింగ్. తర్వాత ఆ బైక్ మీద వచ్చిన యువకులు కర్ర తీసుకుని బాలికలను తీవ్రంగా కొట్టడం ప్రారంభించారు. దీంతో బాలిక అన్నదమ్ములు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన జరిగిన వెంటనే.. బాలిక తన మేనమామతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితులపై ఫిర్యాదు చేసింది. పిన్స్ శ్రీవాస్తవ, మోను శ్రీవాస్తవ, శిబు దహియా, బబ్లూ శ్రీవాస్తవలను నిందితులుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు గాఢా పోలీస్ స్టేషన్‌లో నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని సీఎస్పీ తుషార్ సింగ్ తెలిపారు.
Madhya Pradesh: Miscreants beat up girls over a minor issue in Jabalpur. A video of the incident is going viral on social media. A case has been registered against the accused. pic.twitter.com/tbYqkr9mR1
— Free Press Journal (@fpjindia) December 10, 2021
Also Read: షుగర్ పేషేంట్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఆ.. కణాలను’ తొలగిస్తే.. శాశ్వత నివారణ అంటున్న శాస్త్రవేత్తలు..