Cricket: ముగ్గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్.. ఐసోలేషన్‌లో ఉన్న ఆ ఆటగాళ్లు ఎవరంటే..
పాకిస్తాన్ టూర్‌కు వచ్చిన ముగ్గురు వెస్టిండీస్ట్ ఆగాళ్లకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ముగ్గురు ఆటగాళ్లతో పాటు మేనేజ్‌మెంట్ సభ్యుడికి కరోనా సోకింది...
పాకిస్తాన్ టూర్‌కు వచ్చిన ముగ్గురు వెస్టిండీస్ట్ ఆగాళ్లకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ముగ్గురు ఆటగాళ్లతో పాటు మేనేజ్‌మెంట్ సభ్యుడికి కరోనా సోకింది. ముగ్గురు ఆటగాళ్లకు వైరస్ సోకడంతో వారు పాక్‌తో జరిగే సరీస్‌కు అందుబాటులో ఉండరు. కరేబియాన్ ఆటగాళ్లు రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, కైల్ మేయర్స్‌కు కరోనా వచ్చింది. వెస్టిండీస్ జట్టు గురువారం పాకిస్తాన్‌కు చేరుకుంది. పరిమిత ఓవర్ల పర్యటనలో భాగంగా సోమవారం నుంచి కరీబియన్ జట్టు పాకిస్తాన్‌లో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. పాకిస్తాన్‌కు చేరుకున్న తర్వాత నిర్వహించిన PCR పరీక్షల్లో వెస్టిండీస్‌కు చెందిన నలుగురికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని వారందరు ఐసోలేషన్‌లో ఉంటారని క్రికెట్ వెస్టిండీస్ (CWI) తెలిపింది.” లెఫ్ట్ ఆర్మ్ పేసర్ షెల్డన్ కాట్రెల్, ఆల్‌రౌండర్‌లు రోస్టన్ చేజ్, కైల్ మేయర్స్, టీమ్ మేనేజ్‌మెంట్ యూనిట్‌లోని సభ్యుడు పాకిస్తాన్ సిరీస్‌లో పాల్గొనేందుకు అందుబాటులో ఉండరు. ఈ నలుగురు సభ్యులకు పూర్తిగా టీకాలు వేయించుకున్నారు. వీరికి పెద్దగా కరోనా లక్షణాలు లేవు.” అని క్రికెట్ వెస్టిండీస్ ప్రకటన పేర్కొంది.
ఆటగాళ్లు, సిబ్బంది ఇంకా రూమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. వారికి కరోనా వచ్చినప్పటికీ పర్యటన కొనసాగుతుందని మేము విశ్వసిస్తున్నాము. COVID-19 సంక్రమణ ప్రమాదాన్ని పూర్తిగా తొలగించడం అసాధ్యం. CPLకి ముందు నుండి దాదాపుగా బయో-సెక్యూర్ బబుల్స్‌లో జీవిస్తున్నారు. మా స్క్వాడ్ నుండి ముగ్గురు ఆటగాళ్లు దూరం కావడం సన్నాహాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అయితే మిగిలిన స్క్వాడ్ మంచి ఉత్సాహంతో ఉన్నారు.” అని క్రికెట్ వెస్టిండీస్ CEO జానీ గ్రేవ్‌కి చెప్పాడు.