Love Marriage: లవ్ మ్యారేజ్ చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే వచ్చేయండంటున్న అమ్మాయిలు.. పూర్తివివరాలివే..
Love Marriage: రాజుల కాలంలో అమ్మాయి పెళ్లీడుకు వచ్చిందంటే స్వయంవరం ప్రకటించేవారు. ఆ స్వయంవరానికి హాజరైన యువకుల్లో తమకు నచ్చిన వారిని సదరు యువతులు..

Love Marriage: రాజుల కాలంలో అమ్మాయి పెళ్లీడుకు వచ్చిందంటే స్వయంవరం ప్రకటించేవారు. ఆ స్వయంవరానికి హాజరైన యువకుల్లో తమకు నచ్చిన వారిని సదరు యువతులు కోరుకుని వివాహం చేసుకునేవారు. అప్పట్లోనే అంత స్వేచ్ఛ మహిళలకు ఉండేది. కానీ, ప్రస్తుత కాలంలో అలాంటి స్వేచ్ఛ ఉందా? అంటే ఉంది, లేదు అని సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏదిఏమైనా.. ఓ గ్రామంలోని అమ్మాయిలు మాత్రం అబ్బాయిలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే వారు తమ గ్రామానికి రావొచ్చని ప్రకటించారు. అవును మీరు వింటుంది నిజంగా నిజమండి బాబు. అయితే, కొన్ని షరతులు వర్తిస్తాయని ముందే చెబుతున్నారు. అసలే, ఫ్రీడమ్ కోరుకునే అమ్మాయిలు.. అన్నింటిల్లో సమానత్వమే కావాలంటున్నారు. అవును.. అక్కడి గ్రామ ప్రజలది ఒక్కటే నినాదం. స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అనేది వారి నినాదం. అందుకే ఆ షరతులు కూడా దాని ప్రకారమే ఉంటాయి. విటన్నంటికీ అంగీకరిస్తేనే వివాహం జరుగుతుంది. లేదంటే కథ కంచికి.. మీరు ఇంటికే. ఇంతకీ ఈ ఆఫర్ ఇస్తున్న అమ్మాయిలు ఎవరు? ఎక్కడి వారు? అనే పూర్తి వివరాల్లోకెళి ఇప్పుడు వెళదాం.
బ్రెజిల్‌లోని నోయివా డొ కోర్డెరోకు సంబంధించింది ఈ ప్రకటన. ‘మా గ్రామంలోని అమ్మాయిలకు పెళ్లి కొడుకులు కావలెను. మీ నైపుణ్యం, తెలివితేటలు ఉపయోగించి ఇక్కడి అమ్మాయిలను ప్రేమించి పెండ్లి చేసుకునే సదుపాయం కూడా కలదు. పేరుకు మాత్రమే ప్రేమిస్తే సరిపోదు.. ఇరుపక్షాలు ఒప్పుకొంటేనే వివాహం జరుగుతుంది. అయితే, వివాహం తర్వాత మా గ్రామంలో ఉండాలంటే మాత్రం అబ్బాయిలకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి’ అంటూ ప్రకటించింది. ఇంత ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.. అక్కడి అమ్మాయి మరీ స్వేఛ్చను కోరుకుంటున్నారేమో అనే సందేహం అక్కర్లేదండోయ్. వారు బారెడు పొద్దెక్కేవరకు నిద్రపోయి.. బెడ్ కాఫీ తాగే బ్యాచ్ అస్సలు కాదు. కోడి కూయక ముందే నిద్ర లేచి పనులు చేసే బ్యాచ్. అవును.. వారు పలుగు, పార పట్టుకుని పొలం పనులకు సైతం వెళ్తారు. తమ పనులను తాము చేసుకుంటారు. కుటుంబానికి, బంధాలకు, బంధుత్వాలకు ఎనలేని మర్యాద, గౌరవం ఇస్తారు. ఇంత పని చేస్తారు మోటుగా ఉంటారేమో అని సందేహం కూడా అస్సలు. వద్దు ఈ గ్రామంలోని అమ్మాయి అచ్చం దేవకన్యల మాదిరిగా ఉంటారు. అలాంటి అమ్మాయిలు తమకు సరైన జోడీ ఎక్కడా అని వెతుకుతున్నారు.
పెళ్లి చేసుకోవడానికి షరతులు.. ఇక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే.. ముఖ్యంగా మూడు షరతులను అంగీకరించాల్సి ఉంటుంది. ఏ ఒక్కటి అతిక్రమించినా మూట ముళ్లె సర్దుకొని ఇంటిబాట పట్టాల్సి ఉంటుంది. కండీషన్లేంటంటే.. 1. వంట, 2. అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, 3. టాయిలెట్ కడగడం. ఈ మూడు పనులను జీవితాంతం చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ పనులను భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తారు. అక్కడి అమ్మాయిలు సమానత్వాన్ని కోరుకుంటారు. ఏ పని చేసిన స్త్రీ, పురుషులిద్దరూ సమానంగా చేయాలని భావిస్తారు. అంటే.. అమ్మాయి వంట చేస్తే అబ్బాయి కూరగాయలు తరగాలన్నమాట. ఇలా ఏ పని చేసినా, ఏ బాధ్యతైనా సమానంగా పంచుకోవాలి. మరి ఇవన్నీ ఒకే అయితే బ్రెజిల్‌లోని నోయివా డో కోర్డెరో గ్రామానికి వెళ్లి.. అక్కడి అమ్మాయిల మనసును గెలిచి మనువాడొచ్చు.
Also read:
Big News Big Debate: అణ్వస్త్రాలను రష్యా మోహరించిందా? పుతిన్ ప్రకటనలు కీడు శంకిస్తున్నాయా?
Shocking: తన భర్తను వలలో వేసుకుందని యువతిపై మహిళ ఆగ్రహం.. గుప్పిట కారం తీసుకుని ఏం చేసిందంటే..
Kajal Viral Video: తగ్గేదేలే అంటున్న అందాల చందమామ.. గర్భవతి అయినప్పటికీ.. వైరల్ వీడియో..!