AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambulance: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్‌ అంబులెన్స్‌.. గంటకు 400 కిలోమీటర్ల వేగం.. ధర తెలిస్తే షాకే..

World Fastest and Costly Ambulance: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లు, కార్లు అనే వార్తలు వింటాం. కానీ, లెటెస్ట్‌గా ఈ ఖరీదైన జాబితాలో చేరింది ఓ అంబులెన్స్‌.

Ambulance: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్‌ అంబులెన్స్‌.. గంటకు 400 కిలోమీటర్ల వేగం.. ధర తెలిస్తే షాకే..
Ambulance
Shaik Madar Saheb
|

Updated on: Mar 01, 2022 | 7:25 AM

Share

World Fastest and Costly Ambulance: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లు, కార్లు అనే వార్తలు వింటాం. కానీ, లెటెస్ట్‌గా ఈ ఖరీదైన జాబితాలో చేరింది ఓ అంబులెన్స్‌. మీరు వింటున్నది నిజమే.. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.. అంబులెన్స్‌లు మామూలుగానే చాలా స్పీడ్‌గా వెళ్తాయి. అందులో వైద్యపరంగా కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. అయితే, ఆ అంబులెన్స్‌ల ధర చెప్పుకునేంత ఎక్కువగా ఉండదు. కానీ, దుబాయ్ రోడ్లలో ఇక‌పై ప్రపంచంలోనే అత్యంత ఖ‌రీదైన లైకాన్ హైప‌ర్ స్పోర్ట్స్ అంబులెన్స్‌లు దూసుకెళ్లనున్నాయి. ఇటీవ‌ల దుబాయ్ (Dubai) కార్పొరేషన్ ఆఫ్ అంబులెన్స్ సర్వీసెస్ ఇటీవల దుబాయ్ ఎక్స్‌పోలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్‌, ఖరీదైన అంబులెన్స్‌ను ప్రద‌ర్శించింది. ఈ అంబులెన్స్ కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. గరిష్టంగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంద‌ని నిర్వాహ‌కులు చెబుతున్నారు.

దుబాయ్‌కి చెందిన డబ్ల్యూ మోటార్స్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఏడ‌వ లైకాన్ హైప‌ర్ స్పోర్ట్స్ కారును త‌యారు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా లైకాన్ హైపర్‌స్పోర్ట్ కారు 6 యూనిట్లు మాత్రమే ఉండ‌గా, డ‌బ్ల్యూ మోటార్స్ 7వ కారును త‌యారు చేసింది. ఇక దీని ధ‌ర అక్షరాల‌ 26 కోట్ల రూపాయలు అని చెబుతోంది సంస్థ. ఈ కారును 440 వజ్రాల సెట్తో డిజైన్ చేసింది డబ్ల్యూ మోటార్స్‌. ధరకు తగ్గట్టే, ఈ కారు అంబులెన్స్‌లో సౌకర్యాలు ఉంటాయి. కారు లోపలి టాప్ భాగం బంగారు పూతతో డిజైన్‌ చేశారు. లైకాన్ హైపర్‌స్పోర్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ హోలోగ్రాఫిక్, హోలోగ్రాఫిక్ మిడ్-ఎయిర్ డిస్‌ప్లేతో వస్తుంది.

అయితే, కారు మొత్తం బరువును తగ్గించడానికి పూర్తిగా కార్బన్ ఫైబర్‌ను ఉప‌యోగించింది డబ్ల్యూ కంపెనీ. డ్రైవ‌ర్ ఇచ్చే సిగ్నల్స్ ఆధారంగా ఆ ఖరీదైన అంబులెన్స్‌ ప‌నిచేస్తుంది. ఈ అంబులెన్స్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి ప్రముఖ ఆస్పత్రులు. డబ్ల్యూ మోటార్స్ కంపెనీని 2012లో స్థాపించారు. ఈ కంపెనీ తమ తొలి కాన్సెప్ట్‌ను 2013 దుబాయ్ మోటార్ షోలో ఆవిష్కరించింది.

Also Read:

Viral Video: తగ్గేదెలే.. నెమలి-మేక మధ్య హోరాహోరి పోరు..! వీడియో చూస్తే మతిపోవాల్సిందే..

Viral video: నోట్లో సిగార్.. చేతిలో విధ్వంసకర బాంబ్.. అతని కూల్ యాటిట్యూడ్ మీరూ చూడాల్సిందే..

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..